కొత్తగా కనిపించబోతున్న కలర్స్ స్వాతి

0Swathi-Slim-Lookకలర్స్ స్వాతిగా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన స్వాతి రెడ్డి.. ఓ ఏడాది కాలంగా సినిమాలకు దూరంగానే ఉంటోంది. ఎన్నెన్నో ఆశలు పెట్టుకుని ఈమె లీడ్ రోల్ చేసిన త్రిపుర మూవీ ఫెయిల్ కావడం.. ఈమెను బాగా డిజప్పాయింట్ చేసింది. సినిమా బాగానే ఉన్నా.. ఎప్పుడూ క్యూట్ రోల్స్ లో స్వాతిని చూసిన జనాలు.. ఆమె దెయ్యంగా చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు.

అప్పటి నుంచి చాలానే స్క్రిప్ట్స్ విన్న స్వాతి.. ఇప్పటికి ఓ సినిమాకి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆదిత్య అనే కొత్త దర్శకుడు.. ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. గతంలో క్షణం మూవీ చేసిన రవికాంత్ పెరెపు నకు అసిస్టెంట్ గా పని చేసిన ఆదిత్య.. సింగిల్ సిట్టింగ్ లోనే స్వాతిని ఒప్పించేశాడట. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ స్క్రిప్ట్ లో స్వాతిని భాగం చేసేందుకు ఒప్పించాడట ఆదిత్య.

ఇప్పటివరకూ పక్కింటి అమ్మాయి పాత్రలతో ఆకట్టుకున్న స్వాతికి.. ఈ రొమాంటిక్ డ్రామా డిఫరెంట్ గా కనిపించాల్సి ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఆ విషయంలోనే ఆలోచనలో పడ్డ స్వాతి.. ఇంకా ఈ చిత్రానికి సైన్ చేయలేదని తెలుస్తోంది. అయితే సమ్మర్ లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ రొమాంటిక్ మూవీలో స్వాతి భాగం కావడం లాంఛనమే అని.. ఆమె ఈ స్క్రిప్ట్ పై పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉందనే టాక్ ఉంది.