మహేష్ పై జోక్స్.. వార్తల్లో కమెడియన్!

0స్టాండప్ కమెడియన్ అంటే తెలుసు కదా? స్టేజ్ మీద నిలబడి జోక్స్ చెప్పడం. ఇలాంటి వాళ్ళు నార్త్ లో ఎక్కువగా ఉంటారు. అదే కోవలో తమిళ నాడుకు చెందిన మనోజ్ ప్రభాకర్ అనే స్టాండప్ కమెడియన్ రీసెంట్ గా మహేష్ బాబు పై ఫుల్లుగా జోకులు పేల్చాడు. ఈ మనొజ్ కు పెద్దగా పాపులరిటీ లేదు గానీ వాట్సాప్ లో మాత్రం కొన్ని ఇంగ్లీష్ లో జోక్స్ చెప్తున్న వీడియోస్ సర్కులేషన్ లో ఉన్నాయి.

ఇక అసలు విషయానికి వస్తే ఈ మనోజ్ రీసెంట్ గ ఒక షో లో మహేష్ బాబు టాపిక్ తీసుకున్నాడు. మహేష్ ‘స్పైడర్’ సినిమా ను ప్రస్తావిస్తూ మహేష్ కు అసలు ఎక్స్ ప్రెషన్స్ పలకవని హైదరాబాద్ లో ఉండే రాక్స్(బండరాళ్ళు) లా ఆ ఎక్స్ ప్రెషన్స్ ఉంటాయని అన్నాడు. ఇక అంతటితో ఆగకుండా మహేష్ లాగే కత్రినా కైఫ్ కూడా అందంగా ఉంటుందని కాకపోతే అలాగే ఎక్స్ప్రెషన్స్ పలకవని అన్నాడు. మహేష్ ను మేల్ వెర్షన్ కత్రినా అని కూడా పోల్చాడు. స్పైడర్ లో ఎస్ జె సూర్య ఇరగదీస్తుంటే మహేష్ మాత్రం యాక్టింగ్ చేయకుండా అలా నిలబడి ఉంటాడని అన్నాడు. ఇక తమిళం లో స్పైడర్ మొదటి సినిమా కానీ తెలుగులో మహేష్ చాలా సినిమాలు చేశాడని.. ఆగడు.. ఒక్కడు.. సైనికుడు.. అంటూ అక్కడ తెలుగు డైరెక్టర్లు కూడా ‘ఎక్స్ ప్రెషన్ కుడు.. కుడు'(ఎక్స్ ప్రెషన్ ఇవ్వు ఇవ్వు) అని బతిమలాడుతున్నారని అన్నాడు. ఇంతే కాదు టామ్ క్రూజ్ ఫేస్ బుక్ పేజిలో మహేష్ ఫ్యాన్స్ రచ్చ చేసిన విషయాన్నీ గుర్తు చేసి దాని మీద కూడా జోక్స్ పేల్చాడు.

ఇక ఈ వీడియో చూసిన మహేష్ ఫ్యాన్స్ మనోజ్ పై ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే మనోజ్ ను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. కొంతమంది ఇప్పటికే బూతులు తిడుతున్నారు. క్లాస్ గా ఉన్న అభిమానులు కొంతమంది తమిళ స్టార్ హీరో విజయ్ ఎక్స్ ప్రెషన్స్ గురించి మనోజ్ ను ఒక సారి అలానే మాట్లాడమని సూచిస్తున్నారు.