బిచ్చం ఎత్తుకుంటున్న ఆ నటుడికి ఛాన్స్ లు!

0


pallu-babu-gets-movie-offerసినిమా ప్రపంచం చాలా చిత్ర.. విచిత్రంగా ఉంటుంది. ఎవరికి ఎప్పుడు అవకాశాలు వస్తాయో ఓ పట్టాన అర్థం కాదు. కొందరికి అవకాశాలు ఎందుకు రావో కూడా తెలీని పరిస్థితి. కొందరు బిజీబిజీగా ఉంటే.. మరికొందరు ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ప్రేమిస్తే చిత్రంలో యాక్ట్ చేస్తే హీరో.. ఆ తర్వాత పాలిటిక్స్.. ఆ తర్వాత సీఎం అంటూ డైలాగ్ చెప్పి అందరిని నవ్వించిన హాస్య నటుడు పల్లు బాబు.

ఆ సినిమాలో అందరి దృష్టిని ఆకర్షించిన పల్లు బాబు.. తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా రావాల్సిన పేరు రాలేదు. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. పూట గడవని పరిస్థితుల్లో చూలైమేడులోని ఒక గుడి ముందు భిక్షాటన చేస్తూ మీడియా కంట్లో పడటంతో ఆయన ఉదంతం పెను సంచలనంగా మారింది.

మీడియా కథనాలు చిత్ర పరిశ్రమలోని కొందరిని కదిలించాయి. స్టంట్ నటుడు సాయిదీనా దర్శకుడు మోహన్ లు గుడి దగ్గరకు వెళ్లి పల్లు బాబును తమతో తీసుకొచ్చారు. తాజాగా.. సాయిదీనా ఒక వీడియో విడుదల చేస్తూ.. పల్లుబాబు ఇప్పుడు ఆరోగ్యంగా తమ దగ్గరే ఉన్నాడని.. అతను మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లుగా వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పారు. ఇప్పుడు కొందరు దర్శకులు ఫోన్ చేసి మరీ అవకాశాలు ఇస్తామని చెబుతున్నారట. త్వరలోనే ఆయన తమిళ సినిమాలో నటిస్తారని చెబుతున్నారు. అవకాశాల కోసం ప్రయత్నించి.. ప్రయత్నించి జీవనం కష్టంగా మారటంతో భిక్షాటన చేశానని..ఇప్పుడు అసరాగా నిలుస్తున్న స్నేహితులకు థ్యాంక్స్ చెబుతున్నాడు పల్లు బాబు. అన్ని బాగుంటే త్వరలోనే మరోసారి వెండితెర మీద మెరవటం ఖాయమంటున్నారు. అంతా మంచే జరగాలని కోరుకుందాం.