జైరామ్‌రమేష్‌కు వెంకయ్య కౌంటర్

0venkaiah-naiduand-jairam-rameshహైద్రాబాద్ సమీపంలోని స్వర్ణభారతి ట్రస్ట్‌కు తెలంగాణ ప్రభుత్వం రెండుకోట్ల రూపాయాల పన్ను మినహయింపు ఇస్తూ రహస్య జీవో ఇచ్చిందని కాంగ్రెస్ నేత జైరామ్‌రమేష్ చేసిన ఆరోపణలపై వెంకయ్యనాయుడు కార్యాలయం తీవ్రంగా స్పందించింది. ఈ ఆరోపణలను కొట్టిపారేసింది.

స్వర్ణభారతి ట్రస్ట్ లాభాపేక్షతో కూడిన సంస్థ కాదని తెలంగాణ ప్రభుత్వమే స్పష్టం చేసిందని, ఈ ట్రస్టుకు ఎలాంటి అభివృద్ది రాయితీలు ఇవ్వలేదని తెలిపింది. ఈ ట్రస్టులో వృత్తి నైపుణ్యత, ఆరోగ్య సేవలు, మహిళా, నిరుద్యోగులకు , ఉపాధి కార్యక్రమాలు చేపడుతూ సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తున్నందున మరింత ప్రోత్సహించేందుకు పన్ను మినహయింపులు ఇచ్చినట్టు తెలంగాణ ప్రభుత్వమే స్పష్టం చేసిందని గుర్తుచేసింది.

కుటుంబసభ్యులు చేస్తున్న టయోటా డీలర్‌కు సప్లై ఆర్డర్ ఇచ్చారని అనడం తప్పన్నారు. టయోటా కంపెనీనే నేరుగా తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని వాహనాలు సరఫరాచేసిందన్నారు. తన కుటుంబసభ్యులు చేస్తున్న వ్యాపారాలకు తాను ఎప్పుడూ దూరంగానే ఉన్నానని చెప్పారు. ఆరోపణలు చేసేముందు ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని వెంకయ్యనాయుడు కార్యాలయం కోరింది. కుశభవ్‌ఠాక్రే మెమోరియల్ ట్రస్ట్‌కు భూ కేటాయింపులపై కూడ వెంకయ్య వివరణ ఇచ్చారు.

భూ కేటాయింపుల వ్యవహరంలో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. జైరాం రాజకీయ దురుద్దేశ్యంతోనే తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్నవేళ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వెంకయ్య మండిపడ్డారు. తాను ఒక నిబద్ధత కలిగిన ఉన్నత సంస్కృతి గల రాజకీయపార్టీ సభ్యుడిగా ప్రజల కోసం వారి ఉన్నతి కోసం పనిచేశానని వెంకయ్య స్పష్టం చేశారు.