నాగార్జున ఫామ్ హౌస్ లో విషాదం..ఇద్దరి మృతి

0అక్కినేని నాగార్జున ఫామ్ హౌస్ లో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నగర శివారు రంగారెడ్డి జిల్లా పాపిరెడ్డి గూడ ప్రాంతంలో నాగార్జునకు ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ లో నాగార్జున వ్యవసాయం నిర్వహిస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకటరాజు (32) దుర్గ (30) దంపతులు ఈ ఫామ్ హౌస్ లో కూలీలుగా చాలా కాలంగా పనిచేస్తున్నారు.

అయితే దంపతులు ఇద్దరూ నాగార్జున వద్దే పనిచేస్తూ ఫామ్ హౌస్ లో నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి అక్కడే లో మృతిచెందారు. గత రాత్రి ఇంట్లో కరెంట్ పోవడంతో వెంకటరాజు ట్రాన్స్ ఫార్మర్ ని పరిశీలించడానికి వెళ్లాడు. అక్కడ తెగిపడ్డ విద్యుత్ తీగను గమనించకపోవడంతో షాక్ తగిలి మృత్యువాత పడ్డాడు. భర్త విలవిల లాడుతుంటే భార్య దుర్గ కూడా అతడిని కాపాడబోయి విద్యుదాఘాతానికి గురైంది. ఇద్దరూ కరెంట్ షాక్ కు అక్కడిక్కడే చనిపోయారు. దీంతో ఫామ్ హౌస్ లో విషాదం అలుముకుంది.