దీప్తి సునయినాకు ఫ్లెక్సీ పెట్టేశారుగా

0ప్రచారానికి కాదేదీ కనర్హం అన్నట్లుగా తయారైందిప్పుడు. బిగ్ బాస్ సీజన్ 2 లో ఎలిమినేషన్ ఎదుర్కొన్న దీప్తి సునయినకు మద్దతు పలకాలంటూ లోకల్ ఫీలింగ్ తీసుకొచ్చి మిస్డ్ కాల్ తో ఓట్లు వేసే భారీ ప్రచారం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యూట్యూబ్ తారగా కొన్ని వర్గాలకు మాత్రమే పరిచయమైన దీప్తి సునయిన బిగ్ బాస్ 2లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందరికి సుపరిచితురాలిగా మారింది.

గత వారం ఆమె ఎలిమినేషన్ ను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రాంతానికి చెందిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఒక భారీ ఫ్లెక్సీ ఏర్పాటైంది. ఇబ్రహీం పట్నం ముద్దుబిడ్డ దీప్తి సునయినకు మిస్డ్ కాల్ తో ఓట్లు వేయాలని కోరుతూ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

మిస్డ్ కాల్ మి అంటూ నెంబరు ఇచ్చేసిన ఈ ఫ్లెక్సీ మీద ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫోటోతో పాటు మరో నేత ఫోటోను వేసిన తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.వాస్తవానికి ఈ వారం దీప్తి సునయిన ఎలిమినేషన్ ను ఎదుర్కోవటం లేదు.

అయినప్పటికీ.. ఆమె ఫ్లెక్సీని మాత్రం అలానే ఉంచేశారు. బిగ్ బాస్ 2 లో ఓట్ల కోసం ఇప్పటివరకూ అనుసరించిన ఈ ఫ్లెక్సీ విధానాన్ని రానున్న రోజుల్లో మరెంతమంది ఫాలో అవుతారో? ఒక టీవీ షోకు సంబంధించి ఓట్లు అడుగుతూ ఫ్లెక్సీ ఏర్పాటు ఒక ఎత్తు అయితే.. అందులో స్థానిక ఎమ్మెల్యే ఫోటోను వాడేసిన తీరు మాత్రం కొత్త తరహాగా ఉందన్న మాట వినిపిస్తోంది.