బిగ్‌బాస్‌లో రానా?

0daggubati-ranaజూనియర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవరిస్తున్న బిగ్‌బాస్‌ షో టీవీ రేటింగ్స్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. 14 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటికే సంపూర్ణేష్‌ బాబు, జ్యోతి, మధుప్రియ నిస్క్రమించగా ఆటగాళ్ల సంఖ్య 11 మందికి తగ్గిపోయింది. అంతలోనే ‘బంతిపూల జానకి’ సినిమా ఫేం దీక్షా పంత్‌ను వైల్డ్‌కార్డు ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తాజా ఈ షోలో మరో సెలబ్రిటీ కనిపించనున్నారు.

నెం.1 యారీ ప్రోగ్రామ్‌ ద్వారా యాంకర్‌గా మారిన దగ్గుబాటి రానా బిగ్‌బాస్‌లో పాల్గొననున్నారు. ఆదివారం ప్రసారమయ్యే బిగ్‌బాస్‌లో షోలో ఆయన కనిపించనున్నారు. ఎన్టీఆర్‌తోపాటు ఆయన ఉంటారని సమాచారం. ఇందులో పాల్గొనేందుకు రానా శనివారం ఇక్కడి నుంచి పూణే బయలుదేరారు. అయితే ఇందులో రానా వెళ్లేది మిగతా సభ్యులతో కలిసి ఆడటానికి మాత్రం కాదు. త్వరలో విడుదల కానున్న నేనే రాజు, నేనే మంత్రి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈకార్యక్రమంలో పాల్గొననున్నారు.