పబ్లిక్ లో హీరోయిన్ ప్రైవేట్ పార్ట్ పై డైరెక్టర్ చేయి..!

0సోషల్ మీడియా ఈమద్య కాలంలో ఎంతగా విస్తరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదైనా చిన్న విషయం జరిగితే క్షణాల్లో ప్రపంచం మొత్తం కూడా తెలిసి పోతుంది. ఇక సెలబ్రెటీల గురించిన విషయాలు మరింత స్పీడ్ గా వైరల్ అవుతాయి. తాజాగా హాలీవుడ్ నటి డకోటా జాక్సన్ ఒక సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చింది. ఆ సమయంలోనే ఆమె ప్రైవేట్ పార్ట్ పై దర్శకుడు చేయి వేసినట్లుగా మీడియాలో ఫొటోలు వచ్చాయి. పదుల సంఖ్యలో కెమెరాలు ఉన్నా కూడా దర్శకుడు ఎందుకు హీరోయిన్ ప్రైవేట్ పార్ట్ పై చేయి ఎందుకు వేయాల్సి వచ్చింది అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆ చర్య ఉద్దేశ పూర్వకంగా జరిగింది కాదని – అసలు ఆమెను అగౌరవ పర్చే విధంగా దర్శకుడు ప్రవర్తించలేదు అంటూ అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయి.

అసలు విషయం ఏంటీ అంటే.. డకోటా జాక్సన్ తాజాగా నటించిన హాలీవుడ్ చిత్రం ‘సస్పీరియా’. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి డకోటా పాల్గొనడం జరిగింది. ఆ సమయంలోనే రెడ్ కార్పెట్ పై ఫొటోలకు ఫోజ్ లు ఇస్తున్న సమయంలో డకోటా డ్రస్ కిందికి జారింది. దాంతో దర్శకుడు ఆమె ప్రైవేట్ పార్ట్ కు చేయి అడ్డం పెట్టాడు – అంతే తప్ప చేయితో టచ్ చేయలేదని – ఫొటోల్లో టచ్ చేసినట్లుగా అనిపిస్తుందని సదరు కథనాల్లో చెబుతున్నారు.

హీరోయిన్ పరువు కాపాడేందుకు దర్శకుడు అలా చేశాడు తప్ప మరో తప్పుడు ఉద్దేశ్యం ఏమీ లేదని తేలిపోయింది. ఈ విషయమై హీరోయిన్ కూడా చాలా లైట్ తీసుకున్నట్లుగా అనిపించింది. చేయిని అడ్డు పెట్టినప్పుడు తన డ్రస్ ను సరిచేసుకుని సిగ్గు పడుతూ దర్శకుడి వెనక్కు వెళ్లినట్లుగా ఫొటోలు మరియు వీడియోల్లో కనిపిస్తుంది. అంటే ఆమె దర్శకుడి చర్యను తప్పుబట్టక పోవడంతో పాటు – తన పరువు కాపాడినట్లుగా భావించిందని మీడియా సంస్థలు చెబుతున్నాయి. మొత్తానికి సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ అవ్వడంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది.