ఆడవాళ్ల లిప్‌లాక్: దండుపాళ్యం మరో దుమారం!

0dandupalyam-2-lip-lockఇప్పటికే సంజన న్యూడ్ షో తో వార్తల్లోకి వచ్చిన ‘దండుపాళ్యం-2’ సినిమా ఇప్పుడు అంతకు మించిన హాట్ సీన్ తో చర్చనీయాంశంగా మారింది. సెన్సార్ కట్ అయిన సంజన న్యూడ్ షో సీన్ ను లీక్ చేసి ఈ సినిమాకు కావాల్సినంత ప్రచారాన్ని తెచ్చుకున్నారు దీని రూపకర్తలు. అలాగే ఇదే సినిమాకు సంబంధించి మరో లీక్ కూడా నెట్ లో షికారు చేస్తోంది. ఇదొక కిస్ సీన్. మామూలు కిస్ సీన్ కాదు. లెస్బియన్ ముద్దు సీను, అందునా లిప్ లాక్!

పరమ కిరాతకమైన దొంగల ముఠా కథగా ‘దండుపాళ్యం’ సినిమా వచ్చింది. కన్నడలో వచ్చిన ఆ సినిమా తెలుగులోకి అనువాదం అయ్యింది. ఒళ్లు గగొర్పొడిచే హింసాత్మక సన్నివేశాలున్న ఈ సినిమా కొందరికి నచ్చింది కూడా. కలెక్షన్లు కూడా బాగా రావడంతో రెండో పార్టు వస్తోంది. ఈ సారి హింసనే కాకుండా.. హాట్ సీన్లను కూడా దట్టించినట్టున్నారు. సంజన వీడియోతో పాటు, పూజాగాంధీ లిప్ కిస్ సీన్ కూడా దండుపాళ్యం-2 కి ప్రచారాన్ని తెచ్చిపెడుతోంది.

జైల్లో.. పూజాగాంధీకి మరో మహిళకు మధ్య ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించారు. వారిద్దరూ ఖైదీల దుస్తుల్లోనే ఉన్నారు. ఇండియాలో లెస్బియన్ సీన్లున్న సినిమాలన్నీ వివాదాల పాలయ్యాయి. ఇప్పుడు దండుపాళ్యం-2 కూడా అలాంటి వివాదాన్నే ఎదుర్కొంటోంది. అయితే.. జైళ్లలో ఇలాంటివి జరుగుతున్నాయని.. వాటినే తమ సినిమాలో ప్రస్తావించామని..ఈ సినిమా రూపకర్తలు అంటున్నారు.