త్వరలో దర్శకరత్న దాసరి బయోపిక్

0


dasari-narayana-rao-biopicఇటీవల మరణించిన ప్రముఖ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు జీవితం ఆదారంగా సినిమా తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నటుడు, ఫిలిం ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు ఓ.కళ్యాణ్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. దాసరి శిష్యుల్లోని ఓ ప్రముఖ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలిపారు.

ఇదే తమ గురువుగారికి తానిస్తున్న ఘననివాళి అని ప్రకటించారు ఓ.కళ్యాణ్. ఈ సినిమాతో దాసరి సినీ రాజకీయ జీవితాన్ని ప్రస్థావించనున్నారు. ఆ సాధించిన విజయాలు, ఆ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా తెర మీద చూపించేందుకు రెడీ అవుతున్నారు.

ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.