అంధగాడుని వదిలి మరో హీరోతో హెబ్బా

0Hebah-patel-and-Naga-Anveshకొన్ని సినిమాలు కలిసి నటిస్తే చాలు.. ఆ హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది అని పుకారులు పుడతాయి. బాలీవుడ్లో ఈ సంప్రదాయం ఎక్కువగా పాపులరైంది. ఇలా చేస్తే సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కుతుందని జనాలలోకి తొందరగా వెళుతుందని వాళ్ళ గుడ్డి నమ్మకం. కట్ చేస్తే టాలీవుడ్ లో కూడా ఇదే పబ్లిసిటీని తెగ వాడేస్తున్నారని అనిపిస్తోంది.

కుమారి 21 f లో కలిసి నటించిన రాజ్ తరుణ్ – హెబ్బా పటేల్ మధ్యన మ్యాటర్ పరిగెత్తేస్తోందని ఒక రూమర్ ఉంది. అంధగాడు సినిమా విడుదలైనప్పుడు అయితే వీళ్ళ పై తారాస్థాయిలో రూమర్స్ వచ్చాయి. వాళ్ళు చెబుతునట్లు స్నేహం కాదని హెబ్బా.. రాజ్ తరుణ్ తో పీకలు లోతు ప్రేమలో ఉందని రాశారు. షాకింగ్ ఏంటంటే.. ఇప్పుడు రాజ్ తరుణ్ కాదని హెబ్బ పటేల్ ఒక పాపులర్ కాని యంగ్ హీరో నాగ అన్వేష్ తో డేటింగ్ చేస్తోందని రూమర్లు వినిపిస్తున్నాయి. విషయం ఏంటి అంటే అన్వేష్ నటించిన ఏంజెల్ లో హెబ్బ పటేల్ లీడ్ రోల్ చేస్తుంది. ఈ కుర్రాడు పాత ప్రొడ్యూసర్ సింధూర్ పువ్వు కృష్ణ రెడ్డి కొడుకు. ఇలా ఈ హీరోయిన్ తో అఫైర్ ఉంది అని తెలిస్తే సినిమాకు కాస్త పబ్లిసిటీ వస్తుందని కావాలనే ఈ పబ్లిసిటీ చేస్తున్నారనేది ఇండస్ర్టీ టాక్.

సినిమాను ఎలా మార్కెటింగ్ చేయాలో తెలియక ఇలాంటి చీప్ ట్రిక్ ప్లే చేయడం వలన అటు సినిమాకు నష్టం ఇటు నటి నటులుకు పెద్దగా ఉపయోగం ఉండదు. సినిమాలో కంటెంట్ ఉంటే ఏ ఎఫైర్ల గురించి పబ్లిసిటీ చేయక్కర్లేదు. అంతే కదూ?