‘దేవి శ్రీ ప్రసాద్’ యూత్ సినిమా

0danraj‘మా సినిమా టీజర్, ట్రైలర్‌ చూసినోళ్లు… ‘శవాన్ని రేప్‌ చేయడం ఏంటి? ఇదొక వల్గర్‌ సిన్మా’ అన్నారు. సినిమా చూస్తే… ఎక్కడా వల్గారిటీ కనపడదు. మాది యూత్‌ సినిమానే… బూతు సినిమా కాదు’’ అన్నారు ధనరాజ్‌. శ్రీ కిశోర్‌ దర్శకత్వంలో డి. వెంకటేశ్, ఆర్వీ రాజు, ఆక్రోశ్‌ నిర్మించిన సినిమా ‘దేవిశ్రీ ప్రసాద్‌’. పూజా రామచంద్రన్, భూపాల్, ధనరాజ్, మనోజ్‌ నందం ముఖ్య తారలు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా గురించి ధనరాజ్‌ మాట్లాడుతూ– ‘‘ఇందులో మార్చురీ వ్యాన్‌ డ్రైవర్‌ ‘శ్రీ’ పాత్రలో నటించాను. ధనరాజ్‌ ఏ పాత్ర అయినా చేయగలడనే మంచి పేరొస్తుంది.

ఈ సినిమా కథంతా ఆరు పాత్రల చుట్టూ తిరుగుతుంది. నటి లీలా రామచంద్రన్‌ పాత్రలో పూజారామచంద్రన్, దేవిగా భూపాల్, ప్రసాద్‌గా మనోజ్‌ నందం, ప్రధాన పాత్రలు చేశారు. పూజ కంటే ముందు 13 మంది హీరోయిన్లకు ఈ కథ చెబితే… రిజెక్ట్‌ చేశారు. మీ సినిమాలో నటించం అని చెప్పారు. పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో, తక్కువ బడ్జెట్‌తో 20 రోజుల్లో సినిమా తీశాం. ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నా. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌గారి పేరుని టైటిల్‌గా పెట్టినప్పటికీ… ఆ పేరుని మిస్‌ యూజ్‌ చేయలేదు’’ అన్నారు.