కొత్త భామతో మణిరత్నం మాయ..

0మణిరత్నం.. విలక్షణ ప్రేమ కథలకు పెట్టింది పేరు. ఎన్నో కళాత్మక చిత్రాలను తీసిన ఆయనకు ఇటీవల బ్యాడ్ టైం నడుస్తోంది. ఆయన తొలి చిత్రాలన్నీ బాక్సాఫీస్ హిట్స్.. ‘మౌనరాగం’ నుంచి చివరగా తీసిన ‘చెలియా’ వరకు ప్రతి సినిమాలోనూ కథానాయకుల పాత్రల్ని బాగా డిజైన్ చేశారు. మణి సినిమాలో నటించే హీరో హీరోయిన్లకు బాగా పేరొస్తుంది. అంతటి దిగ్గజ డైరెక్టర్ తో పనిచేయాలని ఒక్కసారైనా ప్రతి హీరో హీరోయిన్ ఆరాటపడుతుంటారు..

తాజాగా చాలా గ్యాప్ తర్వాత మణిరత్నం మరో మూవీని తీస్తున్నారు. ఇందులో శింబు – అరవింద్ స్వామి – విజయ్ సేతుపతిలు హీరోలుగా నటిస్తున్నారు. హీరోయిన్లుగా అదితిరావు హైదరీ – జ్యోతిక – ఐశ్వర్యా రాజేశ్ ఎంపికయ్యారు. మరో హీరోయిన్ పాత్ర కోసం వర్ధమాన మోడల్ డయానా ఎరప్పాను ఎంపిక చేశారు.

మోడలింగ్ రంగంలోకి వచ్చిన డయానా తాను మణిరత్నం మూవీలో చేస్తానని కలలో కూడా ఊహించలేదని చెబుతోంది. తన పెద్దగా రంగు కూడా ఉందనని.. సినిమాలకు పనికి రాననే అనుకున్నానని.. మణిరత్నం ప్రొడక్షన్ నుంచి కాల్ వస్తే అదో ఫ్రాంక్ కాల్ అనుకున్నానని డయానా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కానీ నిజంగానే తనను తీసుకున్నారని తెలిసి షాక్ అయ్యానని తెలిపింది. తెలుగులో ‘నవాబు’ పేరుతో విడుదల కానున్న ఈ చిత్రంలో డయానా ‘ఛాయా’ అనే అమ్మాయి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.