నయా హాలీవుడ్ సూపర్ గాళ్?

0సూపర్ హీరో సినిమాలు రాజ్యమేలుతున్న రోజులివి. ప్రారంభంలో సినిమా ఆద్యంతం ఒకే సూపర్ హీరో .. ఆ సూపర్ హీరోని ఢీకొట్టే సూపర్ విలన్ ని చూపంచేవారు. ఇప్పుడు ఒకే సినిమాలో పది మంది సూపర్ హీరోలు కనిపిస్తున్నారు. వరుసగా నాలుగైదు సూపర్ హీరో సినిమాలు రిలీజయ్యాక – వాటిలో అందరు హీరోల్ని కలిపి కొత్త సూపర్ హీరో సినిమా తీసి బంపర్ హిట్లు కొడుతున్నారు. అవెంజర్స్ 2 అందుకు ఎగ్జాంపుల్. ఇదో కొత్త ట్రెండ్. హాలీవుడ్ లో ఇప్పుడు సూపర్ హీరోలే డజను పైగా ఉన్నారు. సూపర్ మేన్ – స్పైడర్ మేన్ – బ్యాట్ మేన్ – ఎక్స్ మేన్ – గార్డియన్ – బ్లాక్ పాంథర్ – అవెంజర్స్ .. ఇలా ప్రతిదీ సూపర్ హీరో సినిమానే. వీటన్నిటి మధ్యా గాల్ గాడోట్ అనే సూపర్ మోడల్ కం నటితో `వండర్ ఉమెన్` సినిమా తీసి బంపర్ హిట్ కొట్టారు. గాల్ గాడోట్ నటించిన ఈ సినిమా బిలియన్ డాలర్ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఉమెన్ సూపర్ గాళ్ రోల్ పెద్ద సక్సెసైంది. ప్రస్తుతం వండర్ ఉమెన్ సీక్వెల్ గురించి చర్చ సాగుతోంది.

అయితే ఈ సినిమాలన్నిటికీ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే పాశ్చాత్య దేశాల్లో .. అమెరికా – బ్రిటన్ లాంటి చోట ప్రముఖ ఆంగ్ల రచయితల సృష్టి ఇదని చెప్పాలి. ప్రత్యేకించి డీసీ కామిక్స్ – మార్వల్ కామిక్స్ సంస్థలు తాము ప్రింట్ చేసే కామిక్ బుక్ సిరీస్ లన్నిటినీ సినిమాలుగా విజువల్ రూపం ఇవ్వడం ప్రారంభించాయి. ఆ క్రమంలోనే ఈ సినిమాల వెల్లువ అంతే స్పీడందుకుంది.

ఇప్పుడు `వండర్ ఉమెన్`కే మతి చెడే కాంపిటీషన్ లండన్ బ్యూటీ ఎమీ జాక్సన్ నుంచి తప్పదనే అర్థమవుతోంది. ఎమీజాక్సన్ శంకర్ దర్శకత్వంలోని 2.ఓ (రోబో2) చిత్రంలో రోబోగాళ్ పాత్రలో నటించింది. ఆ క్రమంలోనే ప్రఖ్యాత హాలీవుడ్ టీవీ సిరీస్ లో సూపర్ గాళ్ పాత్రలో అవకాశం అందుకుంది. అయితే అక్కడ అది కేవలం టీవీ సిరీస్ మాత్రమే. ప్రఖ్యాత డీసీ సంస్థ ఈ టీవీ సిరీస్ ని నిర్మించి సీడబ్ల్యూసీ చానెల్ లో టెలీకాస్ట్ చేసింది. ఇప్పుడు ఆ టీవీ సిరీస్ ఆధారంగా ఏకంగా సూపర్ గాళ్ సినిమాని తెరకెక్కించేందుకు డీసీ సంస్థ నిర్ణయించుకుంది. ఈ భారీ బడ్జెట్ సినిమాలో ఎమీకి ఛాన్స్ ఉంటుందన్న మాటా వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఎమీజాక్సన్ ని కన్ఫామ్ చేయాల్సి ఉందింకా. ఒకవేళ ఈ ఛాన్స్ వస్తే ఎమీ జాక్ పాట్ కొట్టినట్టే. వేల కోట్ల బడ్జెట్లతో తెరకెక్కే సూపర్ హీరో సినిమాల్లో ఛాన్స్ అంటే ఆషామాషీ కాదు. ఒకవేళ ఈ ఛాన్స్ తనకే వచ్చి గాల్ గాడోట్ `వండర్ ఉమెన్`లా సక్సెసైతే అటుపై ఇక ఎమీ ఇండియన్ సినిమాల్లో నటించే ఛాన్సే ఉండదు. ఎందుకంటే ప్రఖ్యాత డీసీ సంస్థ నిర్మించే సీక్వెల్ సినిమాలతోనే తనకు జీవితం పూర్తవుతుందనడంలో సందేహమే లేదు. సూపర్ హీరోలకే పోటీనిచ్చే సూపర్ గాళ్ గా ఎమీ ఇచ్చే సర్ప్రైజ్ మామూలుగా ఉండదిక!