బిగ్ బాస్ హౌస్ లో ప్రమాదం.. ఒకరి మృతి

0బిగ్ బాస్ రియాలిటీ షో.. తెలుగుతోపాటు తమిళం మలయాళం కన్నడ భాషలలో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా బిగ్ బాస్ లో అపశృతి చోటుచేసుకుంది. తమిళంలో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్2 నడుస్తుండగా.. ఈ కార్యక్రమాన్ని కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్నాడు. షూటింగ్ సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బిగ్ బాస్ హౌస్ లో పనిచేసే ఓ వ్యక్తి మృతిచెందాడు.

బిగ్ బాస్ హౌస్ లో ఏసీకి సంబంధించిన టెక్నికల్ సమస్యలను పరిష్కరించే క్రమంలో మెకానిక్ రెండో అంతస్తు నుంచి జారి కిందపడ్డాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మెకానిక్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు.

మృతిచెందిన మెకానిక్ గుణశేఖరన్ (30) ది అరియలూరు జిల్లా మాత్తూరు. తలకి తీవ్ర గాయం కావడంతోనే మృతిచెందారని వైద్యులు తేల్చారు. నాజర్తెపేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ తమిళ కార్యక్రమం పూందమల్లి సమీపంలోని సెంబరబాక్కం ప్రాంతంలో ఉన్న ఈవీవీ ఫిలిం సిటీలో జరుగుతోంది.