ధన్‌రాజ్‌పై సంచలన ఆరోపణలు చేసిన దీక్ష

0Deeksha-Panthవాళ్లిద్దరూ బిగ్ బాస్‌ షోలో కో కంటెస్టెంట్స్.. అంతకు ముందే ఒక సినిమాలో హీరో, హీరోయిన్స్. ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య వైరం తారాస్థాయికి చేరింది. వాళ్లేనండీ ధన్‌రాజ్, హీరోయిన్ దీక్షా పంత్. అసలు వీళ్లిద్దరికీ ఏమైంది..? వీరి మధ్య గొడవలకు కారణమేంటి..?

బిగ్ బాస్‌ షో నుంచి గత వారం ఎలిమినేట్ అయిన దీక్ష మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా షో విశేషాలను పంచుకున్న ఆమె ధన్‌రాజ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ధన్‌రాజ్, దీక్ష హీరో, హీరోయిన్లుగా ఓ సినిమాలో నటించారు. ఆ సినిమా చేస్తున్న సమయంలో ధన్‌రాజ్ ప్రవర్తన సరిగా లేదని, అందుకే అతడితో దూరంగా ఉన్నానని, ఈ కారణంగానే బిగ్ బాస్ షోలో తనకు వ్యతిరేకంగా ఉన్నాడని దీక్ష చెప్పుకొచ్చింది.

‘‘నా గురించి తెలియని వాళ్లు విమర్శించారు. అది పర్లేదు కానీ తెలిసినవాళ్లు కూడా విమర్శించారు. అప్పుడు చాలా బాధగా అనిపించింది. అందులో ధన్‌రాజ్ ఒకరు. నేను హౌస్‌లోకి వెళ్లిన మొదటి రోజు నుంచి ధన్‌రాజ్ నాకు వ్యతిరేకంగానే ఉన్నారు. బయట ఎవరు ఎలాంటి వారో తెలియకపోవచ్చు.. కానీ హౌస్‌లో కెమెరాలు ఉంటాయి. ప్రతిది రికార్డు అవుతుంది. నేను సినిమా వరకే ఆయనతో మంచిగా ఉన్నా.. బయట ఎప్పుడూ కలవలేదు. అదే కారణం కావచ్చు. ధన్‌రాజ్ చాలా సార్లు బయట కలుద్దాం అని అడిగారు. దానికి నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను అలా కాదు. ఆయన పదే పదే కలుద్దామని అడగడం నాకు నచ్చలేదు. అదే అతడు మనసులో పెట్టుకుని బిగ్ బాస్ హౌస్‌లో అలా ప్రవర్తించాడు అనిపించింది’’ అని వివరించింది.