అవార్డుల వేదికపై ప్రేమజంట సప్తపది!

0

అవార్డుల వేదికపై ప్రేమజంట ఏడడుగులు వేయడం ఆ కార్యక్రమానికే సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇంతకీ ఆ జంట మరెవరో కాదండోయ్ రణ్ వీర్ సింగ్ – దీపికా పదుకునే. గత కొంత కాలంగా ప్రేమించుకున్న ఈ జంట ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.బాలీవుడ్ కు చెందిన ప్రముఖులెవ్వరికీ వీరి పెళ్లికి ఆహ్వానం లేకపోవడంతో ఆన్ స్కీన్ కెమిస్ట్రీని అదరగొట్టిన ఈ జంట ఆన్ కెమిస్ట్రీని లైవ్ లో చూడాలనుకున్న వాళ్లకు నిరాశే ఎదురైంది. గత ఏడాది లేక్ కోమో లో దీప్ వీర్ ఇరు కుటుంబాలకు చెందిన బంధువుల మధ్య సాధారణంగా జరుపుకున్నారు.

అయితే దీప్ వీర్ ల వివాహాన్ని – వారి సప్తపదిని కళ్లారా చూడలేకపోయామని బాధపడిన వారందరికి ఇటీవల ముంబైలో జరిగిన జీ సినీ అవార్డ్స్ కార్యక్రమంలో రణ్ వీర్ సింగ్ – దీపికా పదుకునే కనువిందు చేసి షాకిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ జంటకు కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న వారు ఓ చిలిపి కోరిక కోరారట. మీ వివాహాన్ని – మీరు నడిచిన ఏడడుగులని ఎవరూ చూడలేకపోయారు. ఇదే వేదికపై ఆ దృశ్యాన్ని మరోసారి చేసి చూపించండని అడిగారట. అసలే ఇద్దరు కోతులు. ఇలా అడిగితే రెచ్చిపోయి అన్నంతపని చేసేయరూ ..అదే జరిగింది. అడిగిన వెంటనే అందుకు సిద్ధమైన రణ్ వీర్ – దీపికా అవార్డుల వేడుక సాక్షిగా ఏడడుగులు నడిచి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తడం విశేషం.

కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న విక్కీ తనకు తోచిన మంత్రాలు చదువుతున్న వేళ దీపిక చున్నీ పట్టుకుని రణ్ వీర్ వేదికపై ఏడడుగులు నడిచిన తీరు చూపరులను ఆకట్టుకుందిట. సరదాగా సాగిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రణ్ వీర్ – దీపిక లని చూసి కెమిస్ట్రీ అదిరిందంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. చూడముచ్చటైన జంట ఏడడుగులు వేయడం చూసన వారంతా తమ సంతోషాన్ని కామెంట్ల రూపంలో పెడుతుండటం పలువురిని ఆకట్టుకుంటోంది.
Please Read Disclaimer