యాసిడ్ ఎటాక్ బాధిత మహిళగా దీపిక

0

బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే లాస్ట్ ఫిలిం ‘పద్మావత్’ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత ఇప్పటివరకూ దీపిక తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. కానీ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా పై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా “దీపిక పదుకొనే #రాజి డైరెక్టర్ మేఘన గుల్జార్ తో తన నెక్స్ట్ సినిమా చేస్తోంది. దీపిక పదుకొనే ఈ సినిమాలో యాసిడ్ ఎటాక్ బాధిత మహిళ పాత్ర పోషిస్తుంది” అని తెలిపాడు.

డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ సినిమా లక్ష్మి అగర్వాల్ అనే మహిళ బయోపిక్. పదిహేనేళ్ళ వయసులో యాసిడ్ దాడికి గురైన యువతి ఈ లక్మ్షి అగర్వాల్. ఆమె ఒక టీవీ షో హోస్ట్.. స్టాప్ యాసిడ్ ఎటాక్స్ అనే కాంపెయిన్ ను మొదలుపెట్టి ఛావ్ ఫౌండేషన్ ద్వారా యాసిడ్ ఎటాక్ బాధిత మహిళల మానసిక ఆరోగ్యానికి సహకారం అందిస్తోంది. ఆమెకు ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు కూడా వచ్చింది.

దీపిక ఈ సినిమా గురించి మాట్లాడుతూ లక్ష్మి అగర్వాల్ జీవిత కథ తనను పూర్తిగా కదిలించిందని.. అలాంటి హింసకు గురయిన తర్వాత కూడా ఎంతో ధైర్యంతో జీవితం కోసం.. విజయం పోరాడింది. పైగా తనలాగే బాధపడిన ఇతరుల కోసం పాటుపడడం ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పింది. దీంతో సినిమానిర్మాణం లో పాలుపంచుకోవడానికి కూడా రెడీ అయిందట. ఈ సినిమా బాలీవుడ్ లో సంచలనం సృష్టించడం ఖాయమని అంటున్నారు.
Please Read Disclaimer