దీపికకు మళ్లీ చేదు అనుభవం!

0Deepika-padukone-gets-trollసోషల్‌మీడియాతో అనుబంధం పెంచుకుంటే అభిమానులకు మరింత దగ్గరవుతామని సెలబ్రిటీలు భావిస్తుంటారు. కానీ కొన్నిసార్లు వారి ఆలోచనలు ప్లాఫ్‌ అవుతూ ముద్దుగుమ్మలకు తలనొప్పి తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం దీపికా పదుకొనెకు అలాంటి అనుభవమే ఎదురైంది. కొన్ని రోజుల కింద దీపిక మ్యాక్సిమ్‌ మేగజీన్ కోసం వేసుకున్న దుస్తులను తప్పుబడుతూ ‘దీపికా.. నీకు భారతీయ సంప్రదాయం గురించి ఏం తెలియదు. నువ్వు వేసుకున్న దుస్తువులే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చునంటూ’ ఆమెపై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు.

తాజాగా వ్యానిటీ ఫెయిర్‌ మేగజీన్ కోసం దీపిక ఓ ఫొటోషూట్ చేసింది. బ్లాక్ స్లిప్ డ్రెస్సు వేసుకున్న ఈ భామ మెడలో డైమండ్ నెక్లస్‌తో ఫొటోలకు ఫోజులిచ్చింది. తనకు మంచి కాంప్లిమెంట్స్ వస్తాయని భావించిన దీపికా.. ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను పోస్ట్ చేయగా ఆమె ఫాలోయర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. దీపిక సన్నగా పుల్లలా మారిందని, బహుశా తిండి తినడం మరిచిపోయి ఉండొచ్చునని కొందరు కామెంట్ చేయగా, నువ్వు ఇంకా బాగా తినాలి లేకపోతే కష్టం అంటూ నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి ఎలాంటి ఆహారం తీసుకోవాలో పొడుగు కాళ్ల సుందరి దీపికకు క్లాస్ పీకారు. వరుసగా రెండోసారి ఇలాంటి అనుభవం ఎదురుకావడంతో ఈ భామ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. మరోవైపు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న పద్మావతి మూవీ షెడ్యూల్స్‌తో దిపిక బిజీగా ఉంటోంది.