దీపిక చెల్లెలిని అంటున్న చరణ్ సిస్టర్

0


Deepika-Padukone-is-specialకృతి కర్బందా అంటే మెగా ఫ్యాన్స్ కు మక్కువ ఎక్కువే. రామ్ చరణ్ మూవీ బ్రూస్ లీలో.. చెర్రీకి అక్కగా నటించిన ఈమె.. టాలీవుడ్ ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది. కన్నడలో పెద్ద హీరోయిన్ గా కంటిన్యూ అవుతూనే ఇక్కడ సిస్టర్ రోల్ లో కనిపించడం విశేషం.

ఈ నెల 16న రిలీజ్ కానున్న బాలీవుడ్ మూవీ గెస్ట్ ఇన్ లండన్ చిత్రంతో హిందీలో సత్తా చాటేందుకు రెడీ అయిపోయిన కృతి కర్బందా.. తనకు ఏకంగా బాలీవుడ్ టాప్ బ్యూటీ దీపికా పదుకొనేతో రిలేషన్ పెట్టేసుకుంది. రిలేషన్ అంటే.. దీపికా తనకు అక్క వరుస అనే టైపులో ఓ చిన్నపాటి ఫ్లాష్ బ్యాక్ చెప్పింది. కొన్నేళ్ల క్రితం అంటే.. అప్పటికి ఇంకా దీపిక కూడా సినిమాల్లోకి రాని టైంలోనే.. ఓ యాడ్ కోసం వీరిద్దరూ కలిసి పని చేయాల్సి వచ్చిందట. ఆ సమయంలో దీపికకు చెల్లెలిగా నటించే అవకాశం ఈమెకు వచ్చిందట. ఆ ప్రకటన చేసే సమయంలో దీపికకు ఓ 16 ఏళ్ల వయసు ఉండొచ్చని.. తన ఏజ్ 12 ఏళ్లని అంటోంది కృతి.

అయితే.. అప్పట్లో దీపికా పదుకొనేకు హీరోయిన్ అవాలనే కోరిక ఉండేది కాదన్న కృతి కర్బందా.. ఇప్పటికీ దీపికా పదుకొనే చూపే మంచితనం చూస్తే ఆశ్చర్యం వేస్తుందట. తనతో అంత హార్ట్ టచింగ్ గా ఉండాల్సిన అవసరం లేకపోయినా.. దీపిక ఎంతో ఆప్యాయంగా ప్రవర్తిస్తుందని చెబుతోంది కృతి కర్బందా.