ప్రకృతి అందాల మధ్య దీపికా పెళ్లి?

0పద్మావత్ తర్వాత కొద్ది నెలలుగా రెస్ట్ లో ఉన్న బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే పెళ్లి పీటలు ఎక్కే సమయం అతి దగ్గరలోనే ఉన్నట్టు మీడియా టాక్ మహా జోరుగా నడుస్తోంది. అనుష్క శర్మ తరహాలో వివాహ వేడుకను విదేశాల్లో కానిచ్చి తిరిగి వచ్చాక రిసెప్షన్ ని గ్రాండ్ గా ఇవ్వొచ్చనే ప్లాన్ లో ఉందట దీపికా. ప్రియుడు కం హీరో రన్వీర్ సింగ్ తో నవంబర్ 10 వెడ్డింగ్ డే గా లాక్ అయ్యిందని ఇప్పటికే హిందీ పత్రికల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టు దీపికా ఫామిలీ ఈ మధ్య విపరీతంగా షాపింగ్ చేసినట్టు కొన్ని లీకులు బయటికి వచ్చాయి. సో పెళ్లి చేసుకోవడం ఖాయమే కానీ బయటికి చెప్పుకోవడం ఇష్టం లేదనే క్లారిటీ వచ్చేసింది. సరే వాళ్ళ పెళ్లి వాళ్ళిష్టం పోనీ ఎక్కడ చేసుకుంటారో అదైనా తెలుసుకోవచ్చా అనే అభిమానుల ఉత్సాహానికి సమాధానంగా కొంత సమాచారం బయటికి వచ్చింది.

ఇటలీలో కొమో సరస్సు సుప్రసిద్ధి. అదే పనిగా సంపన్నులైన టూరిస్టులు అక్కడికి సందర్శన కోసం వస్తుంటారు. దానికి అతి సమీపంలో అద్భుతమైన లొకేషన్లు కన్ను పక్కకు తిప్పుకోనివ్వవు. ఉత్తర ఇటలీలో లంబార్టీ అనే ప్రదేశంలో అబ్బురపరిచే ప్రకృతి అందాల మధ్య వినూత్నంగా వెడ్డింగ్ ప్లాన్ చేసినట్టు వినికిడి. సరస్సు చుట్టూ ఉన్న వసతులు – లాడ్జీలు – విల్లాలు అన్ని ఆ డేట్ కు బుక్ చేసేసారట. అక్కడికి కనుచూపు దూరంలో ఉన్న ఆల్ఫ్ పర్వతాలు అతిధులను మైమరపించడం ఖాయం. గత నాలుగేళ్లకు పైగా డీప్ లవ్ లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు భార్యాభర్తలుగా మారబోతున్నారని వినికిడి. వెన్నునొప్పితో కొంత కాలం బెడ్ రెస్ట్ కే అంకితమైన దీపికా ఇప్పుడు పూర్తిగా కోలుకుందట. నవంబర్ లోపు తాను చేస్తున్న గల్లీ బాయ్ తో పాటు టెంపర్ రీమేక్ సింబా పూర్తి చేసి ఓ మూడు నెలలు వైవాహిక జీవితానికి అంకితం కాబోతున్నాడు రన్వీర్ కపూర్. ఈ మధ్య సెలెబ్రిటీల పెళ్లిళ్లు బాగానే జరుగుతున్నప్పటికీ వరుడు వధువు ఇద్దరూ స్టార్స్ కావడం మాత్రం దీపికా జంట విషయంలోనే జరుగుతోంది. అందుకే దీన్ని చాలా స్పెషల్ వెడ్డింగ్ గా అభివర్ణిస్తున్నారు ఫాన్స్ .