బూబ్ జాబ్ చేయించుకోమన్నారు -దీపిక

0కొన్నేళ్లగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ వరస సక్సెస్ లతో దూసుకుపోతోంది దీపికా పదుకునే. మొదటి సినిమాయే షారూఖ్ ఖాన్ లాంటి పెద్ద స్టార్ తో చేయడంతో చాలా త్వరగా గుర్తింపు వచ్చింది. కానీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో తనకూ కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయంటూ దీపికా పదుకునే బయటపెట్టింది. అందులో ఓ విషయం అందరినీ షాకింగ్ కు గురిచేసింది.

‘‘నా కెరీర్ మొదట్లో సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్న రోజులవి. ఫలానా పనిచేస్తే లాభం ఉంటుందంటూ చాలా సలహాలే వచ్చాయి. ప్రొడ్యూసర్ – డైరెక్టర్ల దృష్టిలో పడేందుకు.. వాళ్లను మెప్పించేందుకు బూబ్ జాబ్ (స్తనాల సైజును సిలికాన్ ఇంప్లాంట్ సర్జరీతో పెంచుకోవడం) చేయించుకోమంటూ సలహా ఇచ్చారు. కోరుకున్న అవకాశం దక్కించుకుకోవడానికి అది దగ్గర మార్గమైతే కావచ్చు. కానీ నేనలాంటి దాన్ని కాదు.. 17 ఏళ్ల వయసులో హీరోయిన్ కావాలని ఇల్లు వదిలి బయటకు వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ నా ధైర్యాన్ని నమ్ముకున్నా’’ అంటూ దీపికా పదుకునే తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి ధైర్యంగా రివీల్ చేసింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో వేధింపుల గురించి.. కాస్టింగ్ కౌచ్ గురించి ప్రస్తుతం బాగానే రచ్చ అవుతోంది. అందుకు బాలీవుడ్ ఏమీ మినహాయింపు కాదని దీపిక కుండబద్దలు కొట్టేసింది. చాలామందికి చేదు అనుభవాలు ఎదురైనా ఏదో ఒక భయంవల్ల బయటకు చెప్పరు. కానీ ఈ విషయంలో దీపికా చాలా డేరింగ్ గర్ల్ అని చెప్పేయొచ్చు.