కవ్వించే సొగసరి

0గ్లామర్ ఒలకబోసే మోడ్రన్ పాత్రలైనా.. నటనకు స్కోప్ ఉన్న పాత్రలైనా సూపర్ అనేలా చేయగలదు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే. అందుకే ప్రతి సినిమాని కళాఖండంలా తీర్చిదిద్దాలని తపించే బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దీపికానే హీరోయిన్ గా పెట్టి వరసగా మూడు సినిమాలు తీశాడు. రామ్ లీలా – బాజీరావ్ మస్తానీ – పద్మావత్ సినిమాల్లో దీపిక తన యాక్టింగ్ తో అదరగొట్టేసింది

పద్మావత్ సినిమాలో రాణి పద్మావతిగా దీపికా నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. ఇదే టైంలో తనలోని గ్లామర్ కోణాన్ని ప్రేక్షకులు మర్చిపోకూడదు అనుకుందో ఏమో కానీ హాట్ ఫోజుతో మళ్లీ అభిమానులకు కిక్కిచ్చింది. తాజాగా ఈవెనింగ్ స్టాండర్డ్ మ్యాగజైన్ కవర్ పేజీపై పిచ్చెక్కించే సెక్సీ స్టిల్ తో కనిపించింది. రాకుమారి లాంటి సొగసరి తన అందాలతో ఈ రేంజిలో కనువిందు చేయడంతో నెటిజన్లు ఆమె బ్యూటీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తో దీపికా పీకల్లోతు ప్రేమలో ఉందనే మాట చాలారోజులుగా వినిపిస్తోంది. ఈ రూమర్ గురించి ఈ జంటను అడిగినా అవుననీ అనడం లేదు.. అలాగని కాదనీ అనడం లేదు. నవంబరులో ఈ జంట పెళ్లి పీటలెక్కనుందనే టాక్ ఉంది. అందుకు తగినట్లే దీపికా కొ్త్తగా సినిమాకూ ఓకే చెప్పడం లేదు.