సినిమాలో కంటే.. పోస్టర్ లోనే కసెక్కించింది

0Deepika-Padukone,-Vin-Dieseబాలీవుడ్ భామలు ఎందరున్నా.. దీపిక స్థానం వేరు. అవసరమైతే గ్లామర్ ను వరదలా పారించే సత్తా అమ్మడి సొంతం. దీపిక లాంటి హీరోయిన్.. డీ గ్లామర్ గా.. పక్కింటి అమ్మాయి అంత సాదాసీదాగా కనిపించాలన్నా ఓకే చెప్పేసేందుకు వెనుకాడదు.

అలాంటి భామ.. హాలీవుడ్ మూవీలో యాక్ట్ చేస్తుందనగానే ఎన్నో అంచనాలు వినిపించాయి. విన్ డీజిల్ లాంటోడు సరసన నటించటం.. ట్రిపుల్ ఎక్స్ సిరీస్ లో మూడో భాగమైన ఈ సినిమాలో దీపిక రోల్ ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ వ్యక్తమైంది. అందుకు తగ్గట్లే విన్ డీజిల్ తో దీపిక హాట్ ఫోటోలు హీటు పుట్టించాయి. సినిమా మీద మరింత అంచనాలు పెంచేలా చేయటంతో పాటు.. ఉత్కంట పెరిగింది.

హాలీవుడ్ కంటే ముందుగా ఇండియాలో విడుదలైన ఈ సినిమాలో దీపికపాత్ర ఎలా ఉంటుంది? అమ్మడు అందాలు మరెంత కొత్తగా కనిపించనున్నాయన్న ఆసక్తితో సినిమాకు వెళ్లిన వారికి నిరాశ తప్పదని చెప్పాలి. గ్లామర్ కంటే కూడా యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో దీపిక క్యారెక్టర్.. భిన్నంగా ఉంటుందని చెప్పాలి. పోస్టర్లలో విన్ డీజిల్ తో హాట్ ఫోజులు సినిమాలు కనిపించవు. ఒక్క ముద్దు సన్నివేశం మినహా.. మరెలాంటి రొమాంటిక్ హాట్ సీన్లు ఉండవు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమాలో కంటే.. విడుదలకు ముందు విడుదల చేసిన పోస్టర్లలోనే దీపిక కసెక్కించిందని చెప్పక తప్పదు.