తనీష్ కు టీవీ9 దీప్తి భర్త స్వీట్ వార్నింగ్

0తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ముగింపు దశకు చేరుకుంది. గత సీజన్ లో మాదిరిగానే ఈసీజన్ లో కూడా ఇంటి సభ్యులకు సంబంధించిన ఆప్తులను బిగ్ బాస్ ఇంట్లోకి పంపించడం జరిగింది. తమ వారు రావడంతో ఇంటి సభ్యులు ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ఇక టీవీ9 దీప్తి భర్త బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాడు. ఆ సమయంలో ఇంటి సభ్యులతో చాలా సమయం ఆయన మాట్లాడటం జరిగింది. అందరు కూడా బాగా ఆడుతున్నారు అంటూ చెప్పిన ఆయన దీప్తి విషయంలో తనీష్ వ్యవహరించిన తీరుపై కాస్త సీరియస్ అయినట్లుగా అనిపించింది.

ఇంట్లోంచి వెళ్తున్న సమయంలో తనీష్ ను ఉద్దేశించి ఫిజికల్ టాస్క్ లు ఆడే సమయంలో కొంచెం చూసుకోండి అంటూ వెళ్లి పోయాడు. టికెట్ టు ఫినాలే టాస్క్ లో భాగంగా తనీష్ మరియు దీప్తిల మద్య చోటు చేసుకున్న పరిణామం అందరికి షాకింగ్ గా అనిపించింది. దీప్తి పట్ల తనీష్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీప్తిని అమ్మ అమ్మ అంటూనే మరీ ఇంతగా టార్గెట్ చేయడం ఏంటీ తనీష్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వ్యక్తం అయ్యాయి.

దీప్తిని పలు సార్లు నామినేట్ చేయడంతో పాటు టాస్క్ ల్లో దీప్తిని తనీష్ టార్గెట్ చేయడం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. అందుకే ఆయన విషయంలో దీప్తి భర్త కాస్త సీరియస్ గానే స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. మరో రెండు వారాల్లో ముగియనున్న బిగ్ బాస్ విజేత ఎవరు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎక్కువ శాతం మంది మాత్రం కౌశల్ అంటూ గట్టిగా నమ్ముతున్నారు. కాని గీత మాధురికి కూడా ఛాన్స్ లేకపోలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.