బిగ్ బాస్ : దీప్తికి అన్యాయం జరిగిందట!

0

Deepthi-Nallamothu-In-Second-Position-in-Bigg-Boss-2తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విజయవంతంగా పూర్తి అయ్యింది. సీజన్ ప్రారంభం అయినప్పటి నుండి ఏదో ఒక వివాదం ఈ షోపై వస్తూనే ఉంది. మొదట నాని హోస్ట్ గా సూట్ అవ్వడని – సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు నుండి నిర్వాహకులు లంచం తీసుకున్నారని ఎన్నో ఎనెన్నో సోషల్ మీడియా కామెంట్స్ వచ్చాయి. ఇక వారం వారం ఎలిమినేషన్ సమయంలో కూడా ప్రేక్షకుల ఓట్లను పరిగణలోకి తీసుకోకుండా ఎలిమినేసన్స్ చేశారు అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇలాంటి నేపథ్యంలోనే బిగ్ బాస్ రన్నరప్ గా విషయంలో కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ సీజన్ చివరి వారం మొత్తం కూడా కౌశల్ మరియు దీప్తిల మద్య హోరా హోరీ అంటూ ప్రచారం జరిగింది. ఒకానొక సమయంలో కౌశల్ కంటే ఎక్కువగా దీప్తికి ఓట్లు పోల్ అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అదే సమయంలో దీప్తి సంబంధీకులు ఫేక్ ఓటింగ్ కు పాల్పడుతున్నట్లుగా కూడా కొందరు ఆరోపించారు. కౌశల్ ఆర్మీ చాలా ఆందోళన చెందారు. కాని అనూహ్యంగా ఫైనల్ లో ఏకంగా నాల్గవ స్థానంలో దీప్తి నిలవడంతో అంతా కూడా షాక్ అయ్యారు.

కౌశల్ కంటే దీప్తికి కాస్త తక్కువ ఓట్లు వచ్చి రెండవ స్థానంలో నిలిచిందని – కాని షో నిర్వాహకులు మాత్రం విమర్శలకు భయపడి రన్నరప్ గా గీతా మాధురిని ప్రకటించారు అంటూ దీప్తి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. దీప్తికి ఫేక్ ఓట్లు ఎక్కువగా పడ్డాయి అనే ఉద్దేశ్యంతోనే బిగ్ బాస్ నిర్వాహకులు ఇలా చేసినట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని దీప్తి సన్నిహితులు మాత్రం ఎక్కువ ఓట్లు వచ్చిన దీప్తిని రన్నరప్ గా ప్రకటించకుండా నిర్వాహకులు ఆమెకు అన్యాయం చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer