ఆ రాయి ఎక్కడ పడితే అదే రాజధాని

0ap-capitalరాష్ర్ట విభజన తేలడంతో ఆంధ్రప్రదేశ్ రాజధానే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో 40 రోజుల్లో కొత్త రాజధాని ప్రకటిస్తామన్న కేంద్రం ఇప్పుడు ఆరు నెలలకు పొడిగించడం క్యాపిటల్ సిటీపై సరికొత్త వార్ కు తెరలేపింది.

ఎవరికి వారు తమ ప్రాంతంలో రాజధాని నగరం నెలకొల్పాలని కోరుతున్నారు. ఆయా ప్రాంతాల ప్రాధాన్యతను, సానుకూల అంశాలను తమ వాదనకు మద్దతుగా ముందుకుతెస్తున్నారు. రాష్ట్ర విభజన అయిపోయిన నేపథ్యంలో కర్నూలు నగరాన్ని అంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర మంత్రి టి. జి. వెంకటేష్ డిమాండ్ చేశారు. కర్నూలును రాజధానిగా చేయడం వల్లే తమ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని అన్నారు. లేకుంటే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని చేపట్టవలసి ఉంటుందని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కేవలం ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేశారని ఆరోపించిన టీజే రాయలసీమలో వజ్రాలు, బంగారు గనులు అపారంగా ఉన్నాయని వెంకటేష్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఇక గుంటూరు, ఒంగోలు మధ్య రాజధాని నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి కోరారు. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు మౌలిక వసతులు మెరుగ్గా ఉన్న విశాకపట్నం రాజధానిగా అనుకూలంగా ఉంటుందని మంత్రి కిషోర్ చంద్రదేవ్ కోరుతన్నారు.

మరోవైపు రాజధానిపై రగడ వద్దన్నారు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి. పిచ్చోడి చేతిలో రాయిలా సోనియా వ్యవహారం తయారైందని, ఆమె విసిరిన రాయి ఎక్కడ పడితే అదే రాజధాని అవుతుందన్నారు జేసీ.