షూటింగ్‌లో ప్రమాదం; మెగాస్టార్ కు గాయాలు

0amitabh-bachchan-accidentబాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గాయపడ్డారు. త‌గ్స్ ఆఫ్ హిందోస్తాన్‌ సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బిగ్ బీ ప‌క్కటెముక‌లు విరిగిన‌ట్లు తెలుస్తున్నది. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే ప్రమాదం తరువాత కూడా బిగ్ బి షూటింగ్ కొనసాగించినట్టుగా సమాచారం. ఈ వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారినా.. చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

షూటింగ్ పూర్తి చేసుకొని ముంబైకి వ‌చ్చిన త‌ర్వాతే డాక్టర్ల సలహాతో ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు. ప‌క్కటెముక‌ల్లో చీలిక వచ్చినట్లుగా వైద్యులు గుర్తించారు. ఆ చీలిక కారణంగానే బిగ్ బీ తీవ్రమైన నొప్పితో బాధపడ్డారు. ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న త‌గ్స్ ఆఫ్ హిందోస్తాన్ వ‌చ్చే ఏడాది దీపావ‌ళికి రిలీజ్‌కానున్నది. విజ‌య్ కృష్ణా ఆచార్య దీన్ని డైర‌క్ట్ చేస్తున్నారు.