దేవ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ ఇలా ఉంది

0

తమిళ హీరో కార్తి కొత్త సినిమా ‘దేవ్’ వాలెంటైన్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న రిలీజ్ అవుతోంది. తెలుగులో కూడా ఈ సినిమా అదే టైటిల్ తో రిలీజ్ అవుతోంది. కార్తికి తెలుగు లో డీసెంట్ మార్కెట్టే ఉంది కాబట్టి తెలుగులో ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ హక్కులను ఠాగూర్ మధు రూ. 6 కోట్లకు చేజిక్కించుకున్నారట.

అయితే ఆంధ్రాలో 3 కోట్ల రేషియోలో ఆయన కొన్ని ఏరియాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను వేరే బయ్యర్లకు అమ్మడం జరిగిందట. కార్తి సినిమాల మార్కెట్ ను బట్టి చూస్తే ఇది రికవర్ అయ్యే మొత్తమే. కార్తి లాస్ట్ ఫిలిం ‘చినబాబు’ తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.5 కోట్ల షేర్ వసూలు చేసింది. అంతకు ముందు వచ్చిన ‘ఖాకీ’ దాదాపు రూ.5.5 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పుడు ‘దేవ్’ కు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా కాంపిటీషన్ లేకపోవడం.. ‘F2’ జోరు ఆల్రెడీ తగ్గిపోవడంతో యావరేజ్ టాక్ వచ్చినా ఈ మొత్తం రికవర్ చేయడం కష్టం కాకపోవచ్చని ట్రేడ్ విశ్లేషకుల అంచనా.

ఈ సినిమాలో కార్తికి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ప్రకాష్ రాజ్.. రమ్యకృష్ణ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటించారు. హ్యారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. రజత్ రవిశంకర్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
Please Read Disclaimer