ఫస్ట్ వీక్ కలెక్షన్: ఇంకా కొట్టాలి దాసూ

0

క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేసినంత మాత్రాన సినిమాలు ఆడే ట్రెండ్ కాదిది. తీర్పిచ్చే విషయంలో ప్రేక్షకులు నిక్కచ్చిగా ఉన్నారు.. మొహమాటపడకుండా కంటెంట్ ఉంటేనే హీరో ఎవరైనా సరే బ్రహ్మరధం పడుతున్నారు. లేదంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఎగుడు దిగుడు ప్రయాణం తప్పడం లేదు. దేవదాస్ ప్రస్తుతం ఇదే స్టేజిలో ఉంది. నాగార్జున నానిల పేరు మీదే బిజినెస్ భారీగా జరుపుకున్న దేవదాస్ కు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రయాణం అంత సాఫీగా జరగడం లేదు. రెండు వారాల క్రితం వచ్చిన శైలజారెడ్డి అల్లుడు తరహాలోనే ఆరంభశూరత్వంగా మిగులుతుందేమోనన్న ఆందోళనలో ఉన్నారు అభిమానులు. ఇప్పటి దాకా దేవదాస్ 55% మాత్రమే పెట్టుబడి రికవరీ చేయగలిగింది. ఇంకా చాలా రాబట్టాల్సి ఉంది. రేపు వస్తున్న నోటా కేవలం ఆరు రోజుల గ్యాప్ తో దండెత్తబోయే అరవింద సమేత వీర రాఘవలను చూస్తే ఇకపై రాబట్టడం దేవదాస్ కు అంత సులభంగా ఉండబోదు. ఇక ఏరియా వారీగా వసూళ్ల లెక్కలు చూస్తే ఓ క్లారిటీ వచ్చేస్తుంది.

నైజాం – 6 కోట్ల 2 లక్షలు

సీడెడ్ – 2 కోట్ల 24 లక్షలు

ఉత్తరాంధ్ర – 2 కోట్ల 11 లక్షలు

గుంటూరు – 1 కోటి 41 లక్షలు

ఈస్ట్ గోదావరి – 1 కోటి 10 లక్షలు

వెస్ట్ గోదావరి – 85 లక్షలు

కృష్ణ – 1 కోటి 25 లక్షలు

నెల్లూరు – 57 లక్షలు

తెలుగు రాష్ట్రాలు 7 రోజుల షేర్ – 15 కోట్ల 55 లక్షలు

రెస్ట్ అఫ్ ఇండియా – 2 కోట్ల 50 లక్షలు

ఓవర్సీస్ – 3 కోట్ల 25 లక్షలు

ప్రపంచవ్యాప్త 7 రోజుల షేర్ – 21 కోట్ల 30 లక్షలు

దేవదాస్ కు జరిగిన థియేట్రికల్ బిజినెస్ 37 కోట్ల 30 లక్షల దాకా ఉంది. అంటే నష్టం రాలేదు అని చెప్పుకోవాలన్నా ఇంకా 16 కోట్ల షేర్ రాబట్టాలి. ఇది అంత సులభం కాదు. గత గురువారం విడుదల కావడంతో లాంగ్ వీకెండ్ తో పాటు గాంధీ జయంతిని కాస్త అనుకూలంగా మార్చుకున్న దేవదాస్ నిన్నటి నుంచి విపరీతమైన డ్రాప్ చూపించడం కలవరపరిచే అంశమే. రానున్న పోటీ నేపథ్యంలో మెయిన్ సెంటర్స్ లో తప్ప ఎక్కువ రోజులు దేవదాస్ ని ఫీడ్ చేయడం కూడా కష్టమే. సో దేవదాస్ యావరేజ్ కన్నా తక్కువ స్థాయికి వెళ్ళకూడదు అనుకుంటే నష్టాల శాతాన్ని తగ్గించి కనీసం 30 కోట్లయినా రాబడితే కొంత నయంగా మిగులుతుంది. మందేసినంత ఈజీ కాదు కాబట్టి దేవదాస్ కు రానున్నవి గడ్డు రోజులే.
Please Read Disclaimer