దేవదాస్ టీజర్ టాక్: సోడా? వాటరా ?

0అనౌన్స్ చేసినప్పటి నుంచి క్రేజీ మల్టీ స్టారర్ గా వార్తల్లో ఉన్న దేవదాస్ టీజర్ విడుదలైంది. నాగార్జున నాని మొదటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. భారీ చిత్రాల నిర్మాత అశ్వనిదత్ సినిమా కాబట్టి ఆ రకంగా కూడా హైప్ ఎక్కువగానే ఉంది. ఇక టీజర్ విషయానికి వస్తే హాస్పిటల్ సెటప్ లో డాన్ గా నటిస్తున్న నాగ్ డాక్టర్ వేషం వేసిన నాని ఇద్దరు కలిసి మందు కొట్టడానికి సిద్ధమవుతుంటే నాగార్జున అటు తిరిగి సోడానా వాటరా అని అడిగే లోపే నాని పెగ్గుని అలాగే రాగా తాగడం సరదాగా ఉంది. ఏదో చెప్పుకోలేని బాధ నానిని సలిపేస్తుంటే అది షేర్ చేసుకోవడం కోసమే ఇద్దరు మీట్ అయినట్టు సీన్ ని బట్టి అర్థమవుతోంది. టీజర్ ఆఖర్లో నాగార్జున దాసు ఏంటి మ్యాటర్ అని అడగటాన్ని బట్టి ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉందని క్లారిటీ వచ్చేసింది.

సింపుల్ సీన్ తో టీజర్ ని కట్ చేసినా మంచి కామెడీతో దీన్ని ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తో మొదలుకుని నాగ్ నాని క్యారెక్టర్స్ మధ్య మంచి కెమిస్ట్రీ ఉన్నట్టు ముందు నుంచి ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. దానికి తగ్గట్టే టీజర్ కూడా కంటిన్యూ అయ్యింది. నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ నాని సరసన రష్మిక మందన్న నటించగా వాళ్ళిద్దరిని మాత్రం ఇందులో చూపించలేదు. తీసిన రెండు సినిమాల్లో కామెడీ థ్రిల్లర్స్ తో మెప్పించిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఏకంగా ఇద్దరు స్టార్స్ ని డీల్ చేస్తుండటం విశేషం. నరేష్-రావు రమేష్-అవసరాల శ్రీనివాస్-సత్య-బాహుబలి ప్రభాకర్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి చాలా గ్యాప్ తర్వాత నాగ్ కు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇదే బ్యానర్ లో ఈ కాంబోలో గతంలో రావోయి చందమామ-ఆజాద్ లాంటి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. దీనికి ఇది కూడా ప్లస్ అవుతోంది. సెప్టెంబర్ 27 రిలీజ్ డేట్ ని మరో సారి పక్కా చేస్తూ టీజర్ చివర్లో చూపించారు. సో ఆ విషయంగా ఇంకే అనుమానాలు అక్కర్లేదు.