తప్పు దేవిదా ? వంశీదా ?

0

మహర్షి ఆడియో హంగామా క్లైమాక్స్ కు చేరుకుంది. రేపు ఐదు మరియు ఆఖరి ఆడియో సింగల్ విడుదల చేయబోతున్నారు. మహేష్ పూజా హెగ్డేల మీద డ్యూయెట్ గా సాగే పాల పిట్ట అనే ట్రాక్ తో మొత్తం పాటలన్నీ వచ్చేసినట్టే. ఇదో ఎలా ఉందో ఇంకో ఇరవై నాలుగు గంటల్లో క్లారిటీ వస్తుంది కాని ఇప్పటిదాకా వచ్చిన నాలుగు పాటల్లో కేవలం ఒకటే మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం ఫాన్స్ కు డైజెస్ట్ కావడం లేదు.

పదరా పదరా ఒక్కటే బెటర్ టాక్ రాబట్టుకుంది. మిగిలిన మూడు దేవి రేంజ్ లో లేవనే కామెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది దేవిశ్రీ ప్రసాద్ లోపమా లేక సరైన అవుట్ పుట్ రాబట్టుకోలేకపోయిన దర్శకుడు వంశీ పైడిపల్లి తప్పిదమా అనే కోణంలో విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్నాయి.

మహేష్ దేవిల కాంబోలో వచ్చిన గత సినిమా భరత్ అనే నేనులో రెండు పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. అంతకు ముందు శ్రీమంతుడు గురించి చెప్పాల్సిన పని లేదు. 1 నేనొక్కడినే బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్ అయినా మ్యూజికల్ గా హిట్టే. సో దేవి ఇంతగా నిరాశ పరిచిన ఆల్బం ఇచ్చింది మహర్షికె.

ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన వినయ విదేయ రామకు సైతం దేవి బ్యాడ్ ట్యూన్స్ ఇచ్చాడు. సరే సినిమానే తేడా కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకోలేదు. కాని మహర్షి మీద బోలెడు ప్రీ పాజిటివ్ టాక్ ఉంది. మ్యూజిక్ కనక ఓ రేంజ్ ఉంటే ఈ పాటికే ఎక్కడో ఉన్న హైప్ హద్దులు పూర్తిగా తెంచేసుకునేది. కాని అలా జరగలేదు. అందుకే బాలన్స్ ఉన్న పాటతో పాటు ట్రైలర్ మీద అభిమానుల కళ్ళన్నీ ఉన్నాయి.
Please Read Disclaimer