వరుణ్ సినిమా నుంచి తప్పుకున్న దేవి

0Varun-Tej-and-DSPమరో నాలుగు రోజుల్లో తన కొత్త సినిమా మిస్టర్ ను విడుదల చేసేందుకు మెగా హీరో వరుణ్ తేజ్ సిద్ధమైపోయాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ మిస్టర్ రూపొందగా.. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఫిదా చిత్రాన్ని కూడా పూర్తి చేస్తున్నాడు వరుణ్ తేజ్. మలయాళ ప్రేమమ్ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తు ఫిదా మూవీ కోసం.. త్వరలోనే యూనిట్ అంతా అమెరికా చెక్కేయనున్నారు.

వరుణ్ తేజ్ తర్వాతి ప్రాజెక్టుపై కూడా ఇప్పటికే క్లారిటీ ఉంది. వెంకీ అట్లూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. తన నెక్ట్స్ మూవీ ప్లాన్ చేసుకున్నారు వరుణ్ తేజ్. ఈ చిత్రం కోసం మొదట రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తాడని చెప్పారు. వరుణ్ తేజ్-డీఎస్పీలు తొలిసారిగా వర్క్ చేస్తారని చెప్పడంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. అయితే.. ఇప్పుడు డీఎస్పీ స్థానాన్ని.. యంగ్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ తో రీప్లేస్ చేసినట్లు తెలుస్తోంది. డీఎస్పీని తప్పించడం.. థమన్ ను తీసుకోవడం ఇప్పటికే జరిగిపోయాయట.

ప్రస్తుతం దేవిశ్రీ ఫుల్ బిజీగా ఉండడంతో.. ఇతర ప్రాజెక్టులు కొన్నిటి షెడ్యూల్ డిస్టర్బ్ కావడంతో.. వరుణ్ తేజ్ సినిమాకు వర్క్ చేసేందుకు టైం పట్టనుందట. అందుకే హీరో-దర్శకుడు-కంపోజర్ పరస్పర అంగీకారంతోనే దేవిశ్రీ ఈ ప్రాజెక్టునుంచి వైదొలగాడని అంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ కి మ్యూజిక్ ఇచ్చే ఛాన్స్ పట్టేసిన థమన్ కి.. మరో మెగా హీరో మూవీక కూడా దక్కడం విశేషం.