భార్య కోసం ధన్‌రాజ్ కంటతడి.. బిగ్‌బాస్‌లోకి హాట్ భామ

0hanraj-gets-emotional-biggbossతెలుగు సీరియల్‌ను మంచిన కలహాలు, కలతలతో సాదాసీదాగా సాగుతున్న బిగ్‌బాస్‌లో సోమవారం కొత్త కోణం కనిపించింది. భావోద్వేగ సన్నివేశాలతోపాటు వినోదంతో బిగ్‌బాస్ కార్యక్రమాన్ని ఇంటిసభ్యులురక్తికట్టించారు. ముఖ్యంగా ధన్‌రాజ్ ఎమోషన్స్ బుల్లితెర ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసిందని చెప్పవచ్చు. ముందు నుంచి ఎన్టీఆర్ చెబుతున్నట్టుగానే బిగ్‌బాస్‌లో అనేక ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకోబోతున్నాయని అర్థమవుతున్నది. మొత్తానికి సోమవారం ధన్‌రాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు.

వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్ ఇంటిలోకి ప్రవేశించిన దీక్షా పంత్ స్విమ్మింగ్ పూల్‌లో దర్శనమిచ్చి ఇంటిసభ్యులకు షాక్ ఇచ్చింది. ఇంట్లో కొత్త సభ్యురాలిని చూసిన సెలబ్రీటీలు కొద్దిసేపు కంగారు పడ్డారు. ఆ తర్వాత ఆమెను ఇంటిలోకి ఆహ్వానించారు. దీక్షా పంత్‌ను కేవలం ధన్‌రాజ్ మాత్రమే గుర్తించడం విశేషం.

ప్రధానంగా బిగ్‌బాస్ 15వ రోజు ఎపిసోడ్‌లో తన భార్య మీద ప్రేమను వ్యక్తం చేసి ధన్‌‌రాజ్‌ వీక్షకులను ఆకట్టుకోవడం విశేషం. ధన్‌రాజ్‌ను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి ఏమైనా చెప్పాలనుకొంటున్నావా అని అడిగారు.

దాంతో నా భార్య ఎనిమిదో నెల గర్భంతో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. బిగ్‌బాస్‌లోకి వచ్చిన తర్వాత తొలివారమే ఎలిమినేట్ అవుతానని అనుకొన్నా. కానీ రెండోవారం కూడా సక్సెస్ ఫుల్‌గా ఆటలో నిలిచాను.

బిగ్‌బాస్ ప్రస్తుతం నన్ను ఓ మనిషిలా మార్చింది. గర్భవతి అయిన భార్య సిరికి నేను అన్ని రకాల సేవలు చేయాలనుకొంటున్నాను. ఇక్కడ ఎంతో మందికి అన్ని రకాల సేవలు చేస్తునన్నాను. ఇక నా భార్యకు నేను అన్ని రకాలు సేవలు చేస్తాను. ఇప్పటివరకు నేను నా భార్యను పట్టించుకోలేదు. ఒక నా భార్యకు సర్వస్వం నేను అవుతా. అందుకు కారణం బిగ్‌బాస్ అని ధన్ రాజ్ ఉద్వేగానికి లోనయ్యాడు.

ధన్‌రాజ్ పరిస్థితిని అర్థం చేసుకొని భార్యతో ఓ వీడియో షూట్ చేయించి చూపుతామని చెప్పారు. అందుకు ధన్‌రాజ్ బిగ్‌బాస్‌కు థ్యాంక్స్ చెప్పాడు. నీ భార్యకు ఏమైనా చెప్పాలనుకుంటే నీవు మాట్లాడే మాటలను షూట్ చేసి ఆమెకూ చూపుతాం అని బిగ్‌బాస్ చెప్పగా ధన్ రాజ్ సంతోషంలో మునిగిపోయారు.

ధన్‌రాజ్ పరిస్థితిని అర్థం చేసుకొని భార్యతో ఓ వీడియో షూట్ చేయించి చూపుతామని చెప్పారు. అందుకు ధన్‌రాజ్ బిగ్‌బాస్‌కు థ్యాంక్స్ చెప్పాడు. నీ భార్యకు ఏమైనా చెప్పాలనుకుంటే నీవు మాట్లాడే మాటలను షూట్ చేసి ఆమెకూ చూపుతాం అని బిగ్‌బాస్ చెప్పగా ధన్ రాజ్ సంతోషంలో మునిగిపోయారు.

మూడోవారంలో ప్రవేశించిన బిగ్‌బాస్‌లో జోష్‌లో ఉన్న కల్పన మూగబోయింది. మోస్తారుగా ఉన్న కార్తీక కత్తి ఓ స్టార్ సెలబ్రిటీగా అందరి మన్ననలు పొందుతున్నది. ఇక బిగ్‌బాస్ రేసులో ఉంటుందనుకొన్న అర్చన ఇక మధుప్రియగా మారుబోతున్నదా అనే అనుమానం కలిగుతున్నది. ప్రిన్స్ అఫైర్ అంశం గురించి బయట ప్రపంచం ఏమనుకుంటున్నదో అనే బెంగ మొదలైంది. బయటకు వెళ్లిన తర్వాత రిలేషన్స్ పాడుకాకూడదు అనే భయం ఆమెను వెంటాడుతున్నది.

ఇక చివర్లో ఇంట్లోకి వచ్చిన దీక్షాపంత్‌ను ఆహ్వానించేందుకు మగ సెలబ్రిటీలు చేసిన డ్యాన్స్ ఆకట్టుకున్నది. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలోని కమ్ టూ ద పార్టీ పాటకు చేసిన డ్యాన్స్ వీక్షకులను అలరించింది. మహేశ్ కత్తి వేసిన స్టెప్పులు ప్రత్యేకంగా అనిపించాయి. బట్టలిప్పిన ప్రిన్స్ తీరు కాస్తా ఓవరాక్షన్‌గా అనిపించింది.