వేశ్యగా మారిన ధన్సిక

0Dhansikaరజినీకాంత్ రీసెంట్ మూవీ కబాలి చిత్రంలో సూపర్ స్టార్ కి కూతురుగా నటించి బోలెడంత గుర్తింపు సంపాదించింది ధన్సిక. సహజంగా ఇలాంటి భారీ చిత్రంలో నటించిన తర్వాత.. వేశ్య పాత్రలో నటించడానికి ఏ హీరోయిన్ అయినా సరే సందేహించడం సహజం. కానీ ధన్సిక మాత్రం ఈ విషయంలో డేరింగ్ గా వ్యవహరిస్తోంది.

అటు కబాలిలో నటిస్తున్నపుడే ఓ వేశ్య పాత్రలో నటించడానికి ఒప్పుకుంది. అది కూడా ఓ షార్ట్ ఫిలిం కోసం కావడం గమనించాల్సిన విషయం. ‘సినం’ అనే టైటిల్ పై రూపొందుతున్న షార్ట్ ఫిలింలో నటిస్తోంది ధన్సిక. ఈ చిత్రంలో బెంగాలీ నటి బిట్టా బోగ్ కూడా యాక్ట్ చేయనుంది. ఆనంద్ మూర్తి దర్శకత్వంలో రూపొందనున్న ఈ షార్ట్ ఫిలింకి.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తో సంగీతం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ వేశ్యకు.. డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ కు జరిగిన మధ్య జరిగిన సంఘర్షణ ఈ ‘సినం’ అంటున్నాడు దర్శకుడు. బిడితా అనే వేశ్య పాత్రలో ధన్సిక నటించనుండగా.. కోల్కతా బ్యాక్ డ్రాప్ లో ఈ షార్ట్ ఫిలిం సాగనుందట.

ఓ డాక్యుమెంటరీ రూపొందించేందుకు ఓ వేశ్యను కలుసుకున్న ఓ దర్శకుడు.. ఆ తర్వాత ఎలాంటి విషయాలు తెలుసుకున్నాడనే అంశాల చుట్టూ ఈ చిత్రం సాగనుందని తెలుస్తోంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుండగా.. వేశ్య పాత్రలో నటించేందుకు గాను.. హావభావాలు వగైరా అంశాలపై ప్రస్తుతం ధన్సిక ప్రిపేర్ అవుతోందట.