ధోని సింప్లిసిటీకి నిదర్శనమీ ఫొటో

0

మహేంద్ర సింగ్ ధోని.. భారత్ కు అద్భుత విజయాలు సాధించిపెట్టి తిరుగులేని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా చరిత్రలో నిలిచిపోయారు. ఎంత ఒత్తిడిలోనైనా చెక్కు చెదరని ఆత్మ విశ్వాసం.. ఓర్పుతో ఉండే ధోని అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. ధోనిని కర్మయోగితో కూడా పోల్చి బాహుబలి దర్శకుడు రాజమౌళి అప్పట్లో కీర్తించారు. అలాంటి ధోని మరోసారి తన భార్యకు చెప్పులు తొడిగి తన సాదాసీదా మనస్తత్వాన్ని చాటుకున్నారు..

ప్రస్తుతం ధోని ఖాళీగా ఉన్నాడు. టెస్టుల నుంచి రిటైర్ అయ్యి టీ20 – వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. టీమిండియా ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ఆడుతుండడంతో ధోని రెస్ట్ తీసుకుంటున్నాడు. రెండు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ధోని స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆస్ట్రేలియా పర్యటనలో కొనసాగుతున్నాడు.

తాజాగా ధోని తన భార్య సాక్షితో కలిసి షాపింగ్ కు వెళ్లాడు. అక్కడ ఆమెకు చెప్పులు తొడుక్కోవడం ఇబ్బందిగా ఉండడంతో స్వయంగా ధోనినే కూర్చొని భార్య సాక్షికి చెప్పులు తొడిగాడు. సాక్షి ఈ ఫొటోలను తీసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ‘బిల్లు నువ్వే కట్టావ్ గా.. షూస్ కూడా నువ్వే వేయ్’ అంటూ సరదా కామెంట్ చేసింది. అంత పెద్ద షాపింగ్ మాల్ లో.. భారత దిగ్గజ క్రికెటర్ గా పేరుపొందిన ధోని ఏమాత్రం అహం.. గర్వం లేకుండా ఇలా సాక్షికి చెప్పులు తొడగడంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Please Read Disclaimer