50 కోట్ల క్లబ్ లో చేరిన ధృవ

0dhruva-first-week-collectioమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘ధృవ’ డిసెంబర్ 9న విడుదలై ప్రేక్షకాభిమానులు నుంచి మంచి స్పందన రాబట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే కరెన్సీ బ్యాన్ వలన ప్రజలంతా డబ్బుకి ఇబ్బంది పడుతున్న సమయంలో విడుదలవడం, సినిమాలకు అంత మంచి సీజన్ కాని డిసెంబర్ నెలలో రావడం వంటి కారణాల వలన ఈ చిత్రం ఎంత మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్లు తగ్గుతాయని పలు రకాల మాటలు వినబడ్డాయి. కానీ ‘ధృవ’ చిత్రం ఆ మాటలంన్నింటినీ కొట్టిపారేస్తూ రూ.50 కోట్ల షేర్ క్లబ్ లో చేరింది.

వరుసగా రెండు పరాజయాల తరువాత చేసిన సినిమా కావడంతో దీనిపై మెగా అభిమానులు భారీ అంచనాల్ని పెట్టుకున్నారు. ధృవ విజయంతో ఆ అంచనాలను అందుకోవడంతో పాటు చరణ్ తన కెరీర్లో కీలక విజయాన్ని సాధించాడు. ఇక రేపు విడుదలవుతున్న ఆర్జీవీ ‘వంగవీటి’, విశాల్ డబ్బింగ్ చిత్రం ‘ఒక్కడున్నాడు’ మినహా జనవరి సంక్రాంతి వరకూ మరే పెద్ద సినిమాలు లేకపోవడం, మెల్లగా కరెన్సీ ఇబ్బందులు కూడా తగ్గుతుండటంతో లాంగ్ రన్ లో ఈ చిత్రం కలెక్షన్లు యధావిధిగా కొనసాగే అవకాశముంది. మరో విశేషమేమిటంటే ఈ సినిమాతో చరణ్ ఓవర్సీస్ లో మిలియన్ మార్కుని కూడా అందుకున్నాడు.