హాలీవుడ్ రేంజులో ధృవ నట్చిత్రం

0ఏ మాయ చేసావే – ఘర్షణ వంటి సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకున్న దర్శకుడు గౌతమ్ మీనన్. ఆయన మేకింగ్ ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రెగ్యులర్ గా కాకుండా సరికొత్తగా ప్రజెంట్ చేయడానికి కష్టపడతారు. చాలా వరకు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేయడానికి హీరోలు ఇష్టపడతారు. చాలా కాలం తరువాత విక్రమ్ గౌతమ్ తో చేయడానికి ఒప్పుకున్నాడు.

గతంలో వీరి కాంబోలో ఓ సినిమా వస్తుంది అనుకున్నప్పటికీ వర్కౌట్ కాలేదు. ఇక ఫైనల్ గా 2018 లో బాక్స్ ఆఫీస్ పై ఈ కాంబో టార్గెట్ వేసింది. ధృవ నచ్చతిరం అనే సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ రీసెంట్ గా రిలీజ్ చేసింది. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కించినట్లు అర్ధమవుతోంది. అద్భుతమైన గన్ షాట్స్ ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. విక్రమ్ స్టైల్ అలాగే కొన్ని ఫైట్స్ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ తెప్పిస్తున్నాయి. గత కొంత కాలంగా విక్రమ్ కి కూడా విజయాలు లేవు. ముఖ్యంగా తెలుగులో అతని సినిమాలు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ధృవ నచ్చతిరం మాత్రం తప్పకుండా హిట్ అవుతుందని ఒక టాక్ అయితే వస్తోంది.

ఇకపోతే ఈ సినిమాలో రాధికా – సిమ్రాన్ వంటి నటీమణులు స్పెషల్ పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇక పెళ్లి చూపులు భామ రీతూ వర్మ ఈ సినిమాలో విక్రమ్ లవర్ గా కనిపించనుంది. అలాగే రేసుగుర్రం వంటి సినిమాలకు ఫోటోగ్రాఫి బాధ్యతలు నిర్వహించిన మనోజ్ పరమహంస.. చెలి అండ్ ఆరెంజ్ వంటి సినిమాలతో తన మ్యూజిక్ తో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన హారీస్ జయరాజ్ ఈ సినిమాకు కీలకమైన సపోర్టు అందిస్తున్నారు.