అకీరా అందుకు రాలేదు…రేణు క్లారిటీ!

0జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలో అద్దె ఇంట్లోకి శుక్రవారం నాడు దిగిన సంగతి తెలిసిందే. పవన్ తో పాటు ఆయన భార్య అన్నా లెజినోవా – కుమారుడు అకీరాలు శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారు. ఆ సందర్భంగా పవన్ – లెజినోవా- అకీరాలు ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవన్ కు నట – రాజకీయ వారసుడు అకీరా వచ్చేశాడంటూ పవన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తండ్రిలాగే అకీరా కూడా చన్నప్పటినుంచే పుస్తకాలు చదువుతున్నాడంటూ పొంగిపోతున్నారు. చరణ్ – బన్నీలాగే చిన్నప్పటి నుంచే నటనలో ప్రావీణ్యం పొందేందుకుతన చదువును కొనసాగించేందుకు అకీరా హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యాడని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరైతే ఏకంగా రేణు దేశాయ్ కు ట్వీట్లు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో అకీరా విజయవాడ టూర్ పై రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చింది.

అకీరా తన స్కూల్ హాలిడేస్ ను తన తండ్రితో గడేపేందుకు మాత్రమే వెళ్లాడని – హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోలేదని రేణు ట్వీట్ చేసింది. విజయవాడలో కల్యాణ్ గారితో అకీరాను చూసిన వారిలో చాలామంది తనను ఇదే విషయం అడుగుతున్నారని వాటిపై స్పష్టత ఇచ్చేందుకు ఈ ట్వీట్ చేస్తున్నానని రేణూ ట్వీట్ చేసింది. వాస్తవానికి పవన్ కంటికి జరగబోతోన్న శస్త్రచికిత్స నేపథ్యంలో అకీరా విజయవాడకు వచ్చాడని తెలుస్తోంది. తండ్రికి చేదోడువాదోడుగా ఉండేందుకే తనయుడు వచ్చాడట. అసలు ఆ మాటకొస్తే తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత కూడా పిల్లలు ఎపుడు కావాలంటే అపుడు వారిని కలవచ్చు. అందులో పెద్ద విశేషం – అభ్యంతరం ఏమీలేదు. సోషల్ మీడియాలో కొందరు అత్యుత్సాహం …రేణుకు చిరాకు తెప్పించడంతో ఆ క్లారిటీ ఇచ్చింది.