‘మహర్షి’ నిర్మాతలు విభేధాలు?

0

సూపర్ స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో `మహర్షి` తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మే9న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. మే1న ట్రైలర్- ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఘనంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈలోగానే సినిమా భాగస్వాముల మధ్య విభేధాలకు సంబంధించిన ఓ ప్రచారం ఫిలిం- ట్రేడ్ సర్కిల్స్ ని వేడెక్కిస్తోంది.

ఇప్పటికే `మహర్షి` ప్రీరిలీజ్ హక్కులకు దేశ విదేశాల్లో భారీ హైప్ నెలకొంది. నైజాం – వైజాగ్ లో పట్టున్న దిల్ రాజు స్వయంగా ఆ ఏరియాల్లో మహర్షి చిత్రాన్ని పంపిణీ చేస్తున్నారని తెలుస్తోంది. `దేవదాస్` బకాయిల వల్ల ఏషియన్ నారంగ్ నైజాం హక్కుల (కొన్నిచోట్ల) విషయమై వేచి చూసే ధోరణితో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. ఇక మహర్షి కృష్ణా జిల్లా పంపిణీ హక్కుల విషయమై దిల్ రాజు.. అశ్వనిదత్ మధ్య చిన్నపాటి మనస్ఫర్థలు కలిగాయని తెలుస్తోంది. కృష్ణా హక్కులు దిల్ రాజుకే చెందుతాయి. వాస్తవంగా అంగీకార పత్రం (కాంట్రాక్ట్) లో అదే ఉన్నా.. ఈ విషయంలో అశ్వనిదత్ తో విభేధాలు వచ్చాయని ప్రచారమవుతోంది. దీంతో ఈ వివాదంలో దిల్ రాజు- పీవీపీ ఒకటయ్యారు. భవిష్యత్ లో అశ్వనిదత్ తో కలిసి సినిమాలు తీయకూడదని నిర్ణయించుకున్నారని కథనాలు వస్తున్నాయి. అంతేకాదు దిల్ రాజు – పీవీపీ డ్యుయో అశ్వని దత్ పై లీగల్ గానూ పోరాడతారని చెప్పుకుంటున్నారు. ఆ మేరకు మీడియాలోనూ దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక దేవదాస్.. బ్రహ్మోత్సవం వంటి చిత్రాలకు సంబంధించిన బకాయి లావాదేవీలు తూ.గో.. కృష్ణ.. గుంటూరు జిల్లాల్లో మహర్షి రిలీజ్ కి అడ్డంకిగా మారుతున్నాయని తెలుస్తోంది. సీడెడ్ లోనూ `బ్రహ్మోత్సవం` చిత్రానికి సంబంధించిన గత లావాదేవీలు వెంటాడుతున్నాయన్న ప్రచారం ఉంది.

మరో కోణంలో `మహర్షి`కి అన్నీ తానే అయ్యి దిల్ రాజు నడిపించడం దత్ కి నచ్చలేదన్నదానిపైనా డిస్కషన్ సాగుతోంది. ప్రచారంలో దిల్ రాజు కనిపిస్తున్నారు కానీ.. ఇతరులు కనిపించడం లేదన్నది వేరొక గొడవ అట. బిజినెస్ .. ఔట్ పుట్ అన్నిటా దిల్ రాజు హవా.. దత్ కి నచ్చడం లేదట. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. దీనిపై దిల్ రాజు బృందం నిజానిజాల్ని వెల్లడిస్తారేమో చూడాలి.
Please Read Disclaimer