ఆ సినిమాను దిల్ రాజు కొన్నాడట !

0జడ్జిమెంట్ విషయంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రీసెంట్ గా విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అలా అని అయన అనుభవాన్ని – టాలెంట్ ను ఏమాత్రం తక్కువ చేయలేం. దిల్ రాజు బ్యాన్నర్ లో ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులు సెట్స్ మీద ఉన్నాయి. ఒకటి మహేష్ బాబు ‘మహర్షి’ కాగా రెండోది వెంకటేష్-వరుణ్ తేజ్ మల్టిస్టారర్ ‘F2’. తాజాగా మరో తమిళ సినిమా హక్కులు కూడా తీసుకున్నారట.

కోలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ సేతుపతి హీరో గా త్రిష హీరోయిన్ గా తమిళంలో ’96’ అనే సినిమా తెరకెక్కింది. మద్రాస్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ లో తెరాకెక్కిన ఈ సినిమాకు ప్రేమ కుమార్ దర్శకుడు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తమిళంలో సెప్టెంబర్ 13 న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా కంటెంట్ చూసి ఇంప్రెస్ అయిన దిల్ రాజు ’96’ తెలుగు రైట్స్ తీసుకున్నారట. మరి ఈ సినిమాను తెలుగు లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారా.. లేదా రీమేక్ చేసే ఆలోచన ఏమైనా ఉందా అన్న విషయం లో మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

విజయ్ సేతుపతి తమిళంలో పెద్ద హీరో అయినప్పటికీ ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ‘సైరా’ లో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడని మాత్రం అందరికీ తెలుసు. ఇక ‘సైరా’ రిలీజ్ అయితే మాత్రం తెలుగులో విజయ్ సేతుపతి పాపులారిటీ చాలా పెరిగే అవకాశం ఉంది గానీ అప్పటిదాకా రాజుగారు వెయిట్ చేస్తారా లేదా అనేది చెప్పలేం. మరి రాజుగారి మనసులో ఏముందో తెలియాలంటే మనం కొన్ని రోజులు ఆగాలి.