దిల్ రాజు చేతికి మెగా డాటర్ సినిమా

0

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ డిస్ట్రిబ్యూషన్ మాత్రం వదిలిపెట్టడం లేదు. గత ఏడాది డిస్ట్రిబ్యూషన్లో నష్టాలు వచ్చాయి కానీ ఈ ఏడాదిలో నందమూరి కళ్యాణ్ రామ్ చిత్రం ‘118’ రాజుగారికి రిలీఫే ఇచ్చింది. తాజాగా మెగా డాటర్ నిహారిక నటించిన ‘సూర్యకాంతం’ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను చేజిక్కించుకున్నారు.

నిహారిక.. రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సూర్యకాంతం’ సినిమాకు దర్శకుడు ప్రణీత్. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ దర్శకుడికి టాలీవుడ్లో ఇదే తొలి చిత్రం. ఈ సినిమాను నిర్వాణ సినిమాస్ బ్యానర్ వారు నిర్మించగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సమర్పిస్తున్నాడు. మార్క్ రాబిన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఇప్పటికే ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ తో ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రానికి దిల్ రాజు బ్యానర్ తోడవడం బాక్స్ ఆఫీస్ వద్ద కలిసి వచ్చే అంశమే.

నిహారిక ఇప్పటి వరకూ నటించిన సినిమాలేవీ కమర్షియల్ గా విజయం సాధించలేదు. మరి హీరోయిన్ క్యారెక్టర్ డిఫరెంట్ గా కనిపిస్తున్న ఈ ప్రేమకథా చిత్రం ‘సూర్యకాంతం’ అయినా నిహారికకు ఒక మెగా బ్రేక్ ఇస్తుందేమో వేచి చూడాలి. ‘సూర్యకాంతం’ సినిమాను మార్చ్ 29 న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Please Read Disclaimer