ఎన్టీఆర్‌ను వ‌దిలేసి అనుష్కను న‌మ్ముకున్నాడు

0anushka-ntrయంగ్ టైగ‌ర్ న‌టించిన రీసెంట్ ఫిల్మ్ రామ‌య్యవ‌స్తావ‌య్యా బాక్సాపీస్ వ‌ద్ద అనుకున్నంత స‌క్సెస్‌ను సాధించ‌క‌పోవ‌డంతో, నిర్మాత దిల్‌రాజుకి కొంత మేర న‌ష్టం చేకూరింద‌ని బాక్సాపీస్ రిజ‌ల్ట్స్‌ను చూస్తే తెలుస్తుంది. రామ‌య్యవ‌స్తావ‌య్యా మూవీకు దిల్‌రాజు నిర్మాత ఉంటూ, అలాగే చాలా వ‌ర‌కూ ఆ మూవీను త‌నే డిస్ట్రిబ్యూష‌న్ చేసుకున్నాడు.

లాభాలు మాట ప‌క్కన‌పెడితే న‌ష్టాల‌ను మాత్రం చాలా వ‌ర‌కు త‌గ్గించుకున్నాడు. ఈ న‌ష్టాన్ని బ్యాలెన్స్ చేసుకోవ‌డానికి దిల్‌రాజు ప్లానింగ్స్ వేసుకున్నాడు. అనుష్క న‌టించిన వ‌ర్ణ మూవీకు సంబంధించిన నైజాం డిస్ట్రిబ్యూష‌న్ రైట్స్‌ను తీసుకున్నాడు. క‌నీసం ఈ మూవీతో అయిన కొంత గ‌ట్టెక్కెద్దాం అనే ఆలోచ‌న‌లో ఉన్నట్టు టాలీవుడ్‌లో వినిపిస్తున్న టాక్‌. అయితే దిల్‌రాజు మొద‌టి నుండి డిస్ట్రిబ్యూట‌ర్ కాబట్టి, వ‌ర్ణ మూవీకు సంబంధించిన డిస్ట్రిబ్యూష‌న్‌ను తీసుకోవ‌డంలో పెద్ద టాపిక్ ఏమి ఉండ‌ద‌ని కొందరు అంటున్నారు.

అయితే వ‌ర్ణ మూవీ డిస్ట్రిబ్యూష‌న్‌ను దిల్‌రాజు మొద‌ట్లో ప‌ట్టించుకోకుండా, అక‌స్మార్తుగా నిర్ణయం తీసుకొని ఆ మూవీ నైజాం డిస్ట్రిబ్యూష‌న్ రైట్స్‌ను తీసుకోవ‌టంతోనే ఇప్పుడు ఇండ‌స్ట్రీ టాపిక్‌గా మారింద‌ని కొంద‌రు అంటున్నారు. ఏదేమైనా అనుష్క న‌టించిన వ‌ర్ణ మూవీతో దిల్‌రాజుకి లాభాలు చేకూరాల‌ని అంద‌రూ ఆశిస్తున్నారు.