రాజ్ తరుణ్ పై దిల్ రాజు వర్డ్ ఎటాక్

0ఎల్లుండి విడుదల కాబోతున్న లవర్ గురించి దిల్ రాజు బాగా టెన్షన్ పడుతున్నారని ఎంత దాచినా బయటపడుతూనే ఉంది. తనే నిర్మాత అయ్యుండి ఏదో ఒక రూపంలో అనుమానాలు వ్యక్తపరచడం చూసి రాజ్ తరుణ్ అభిమానులు ఆందోళన పడటంలో అర్థముంది. ఇక దీని ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ గురించి దిల్ రాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కావాలని రాజ్ తరుణ్ నెగటివ్ చేయాలని కాదు కానీ లవర్ గురించి తాను పడ్డ శ్రమ గురించి చెప్పుకునే క్రమంలో ఆయనకు తెలియకుండా ఫ్లోలో అన్ని అనేసారు. రాజ్ తరుణ్ మార్కెట్ ఇప్పుడు బాగా డౌన్ లో ఉందని మహా అయితే 4 కోట్లకు మించి బడ్జెట్ పెడితే అది రిస్క్ అవుతుందని అలాంటిది తాను దీని మీద 8 కోట్లు పెట్టడం కేవలం మా బ్యానర్ వేల్యూ కోసమే అని చెప్పడం అందరికి షాక్ ఇచ్చింది. డబుల్ బడ్జెట్ లో రాజ్ తరుణ్ తో వర్క్ అవుట్ కాదని చెప్పిన దిల్ రాజు మాటల్లో కాస్త వ్యంగ్యం అనిపించడం విశేషం.

అంతే కాదు ఇంత తక్కువ బడ్జెట్ లో మా బ్యానర్ లో సినిమా చేయలేదు అంటూనే రాజ్ తరుణ్ కు ఇదే ఎక్కువ బడ్జెట్ అని చెప్పడం పుండు మీద కారం చెల్లినట్టే. తన బ్యానర్ లో ఎప్పటి నుంచో చేయాలని రాజ్ తరుణ్ అడిగాడని ఇప్పటికి కుదిరిందని చెప్పి దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్న హర్షిత్ ఐదు పాటలకు వేర్వేరు సంగీత దర్శకులను పెడదాం అన్నప్పుడు కూడా రాజ్ తరుణ్ సినిమాకు అవసరమా అని అడిగారట. మొత్తానికి దిల్ రాజు ఉద్దేశం ఏదైనా అది రాజ్ తరుణ్ కు ప్రతికూలంగానే మారింది. దానికి తోడు పదే పదే నేనే టెన్షన్ గా ఉన్నాను అని దిల్ రాజు చెప్పుకోవడం చూస్తే లవర్ మీద నమ్మకం తగ్గిందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ ఓకే ఎత్తు అయితే రాజ్ తరుణ్ పక్కన పెద్ద హీరోయిన్లు చేయరని అతనికి వెతికి సెట్ చేయటం పెద్ద సవాల్ అని మరో బాంబు వేశారు. మొత్తానికి దిల్ రాజు మాట్లాడిన మాటలు విని రాజ్ తరుణ్ రియాక్షన్ ఎలా ఉండి ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం.