నితిన్ కి బొమ్మరిల్లు సెంటిమెంట్

0దిల్ రాజు కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమా ఏది? అంటే టకీమని `బొమ్మరిల్లు` అని చెప్పేస్తాం. ఈ సినిమాతోనే దిల్రాజుకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. ఫ్యామిలీ ఆడియెన్ని మెప్పించే సినిమాలు తీసే నిర్మాతగా ఆయన పేరు సుస్థిరం అయ్యింది. అందుకే ఆయన ఎప్పుడు మీడియా ముఖంగా మాట్లాడినా ఆ సినిమా గురించి ప్రస్థావిస్తూనే ఉంటారు. ఇప్పుడు అదే `బొమ్మరిల్లు` సెంటిమెంటును అడ్డుపెట్టుకుని తన తాజా చిత్రం శ్రీనివాస కళ్యాణంని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశాడు. బొమ్మరిల్లు 2006 ఆగస్టు 9న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దాదాపు 12 ఏళ్లకు ఆ సినిమా రిలీజ్ తేదీకే శ్రీనివాస కళ్యాణం చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 9న నితిన్ శ్రీనివాస కళ్యాణం రిలీజ్ చేయడం వెనక లాజిక్ గురించి ఈ రోజు ఇంటర్వ్యూలో ముచ్చటించారు.

అరకులో చిత్రీకరించిన పాటతో మొత్తం సినిమా చిత్రీకరణ పూర్తయింది. శ్రీనివాస కళ్యాణం చిత్రంలో స్పెషల్ ఏంటి? కొత్తగా ఏం ఉంటుంది? అంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు. ఆడియెన్ లో ఓ ప్రశ్న ఉంది.దానికి మా సమాధానం.. ఈ సినిమా థియేటర్ నుంచి వెళ్లేప్పుడు అందమైన అనుభూతులతో బయటకు వెళతారు. సతీష్ ఓ ట్రెండ్ సెట్టర్ సినిమాని తెరకెక్కించారు. బొమ్మరిల్లు చూసినప్పుడు మాట్లాడుకున్నట్టే ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు.. అని చెప్పారు. మొత్తానికి నితిన్ కి బొమ్మరిల్లు సెంటిమెంటు వర్కవుట్ చేయాలన్న తెలివైన లాజిక్ దిల్ రాజు బాగానే వాడుతున్నారన్నమాట!