ఎన్టీఆర్ తో ఆ సినిమా తీసి తప్పు చేశా: దిల్ రాజు

0


Dil-Rajuసెన్సేషనల్ డైరక్టర్ దిల్ రాజు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ రామయ్య వస్తావయ్య సినిమా తీసి తప్పు చేశానని అనడడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న టాపిక్. రీసెంట్ గా ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు హరిష్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన రామయ్య వస్తావయ్య సినిమా చేసి తప్పు చేశామని అన్నారు.

అసలైతే ఎన్.టి.ఆర్ తో హరిష్ శంకర్ వేరే కథ అనుకోగా అది అప్పుడే రిలీజ్ అయిన రెబల్ కథకు దగ్గరగా ఉండటంతో ఆ కథను మార్చి మళ్లీ రామయ్య వస్తావయ్య కథ సిద్ధం చేశామని. అది కూడా ఎన్.టి.ఆర్ డేట్స్ ఇచ్చాడు కాబట్టి త్వర త్వరగా చేశామని అన్నారు. కచ్చితంగా ఆ సినిమా కాకుండా రెబల్ కథకు అటు ఇటుగా ఉన్న ముందు కథనే తీసి ఉంటే కనీసం హిట్ అయినా వచ్చేదని అన్నారు.

ఎన్.టి.ఆర్ తో అప్పటికే బృందావనం తీసి హిట్ అందుకున్న దిల్ రాజు తారక్ తో తీసిన రామయ్య వస్తావయ్య అంచనాలను అందుకోలేకపోయామని. ఆ సినిమాకు ఇంకాస్త టైం తీసుకుంటే బాగుండేదని అన్నారు. అంతేకాదు రిలీజ్ చేసిన టైం కూడా బ్యాడ్ అవడం వల్ల సినిమా పోయిందని అన్నారు. ఇక అదే దర్శకుడితో సుబ్రమణ్యం ఫర్ సేల్ ఆ తర్వాత అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాధం తీసి హిట్ అందుకున్నారు దిల్ రాజు.