అందుకే డివైడ్ టాక్ వచ్చింది..దిల్ రాజు!

0నితిన్  – రాశి ఖన్నాల కాంబోలో సతీష్ వేగేశ్న తెరకెక్కించిన `శ్రీనివాస కల్యాణం` సినిమా గురువారం నాడు విడుదలైన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా దిల్ రాజు…ఈ చిత్ర సక్సెస్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న మార్నింగ్ షో తర్వాత యూత్ దగ్గర నుంచి డివైడ్ టాక్ ఉందని – కానీ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి టాక్ వచ్చిందని చెప్పారు. అదే ఈ రోజు చూసిన యూత్…సినిమా బాగుందని చెప్పారని….లేడీస్ – ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోందని అన్నారు. శతమానం భవతి తర్వాత తమ బ్యానర్ లో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయని… అందుకే డివైడ్ టాక్ వచ్చిందని అన్నారు.

దానికితోడు తమ చిత్ర యూనిట్ కూడా ….హిట్ కొడుతున్నాం…అని ప్రమోషన్ కార్యక్రమాల్లో చెప్పారని…దీంతో అంచనాలు మరింత పెరిగాయని అన్నారు. మంచి సినిమా తీసినా…ఆడియన్స్ …యూత్ నుంచి మిక్స్ డ్ టాక్ రావడం ఏమిటిని తనకు అనిపించిందని కానీ ఈ రోజు వస్తోన్న టాక్ చూస్తుంటే రిలీఫ్ గా ఉందని దిల్ రాజు అన్నారు. రేపటి నుంచి ఒరిజినల్ ఆడియన్స్ థియేటర్ కు వస్తారని సినిమా బాగుందంటేనే చూసే ప్రేక్షకులు రేపటి నుంచి వస్తారని అన్నారు. వారంతా మౌత్ టాక్ తోనే సినిమాను…ఫ్యామిలీ ఆడియన్స్ కు ప్రమోట్ చేస్తారని అన్నారు. ఈ సినిమా చూశాక….దిల్ రాజు వెంకటేశ్వరా క్రియేషన్స్ ను ప్రేక్షకులు ఒక మెట్టు ఎక్కిస్తారని అన్నారు. దీంతోపాటు పట్టు వస్త్రాల పంపిణీ రేపటి నుంచి జరుగుతుందని చెప్పారు. ఓ వైపు డివైడ్ టాక్ వస్తోన్నా….తమ `శ్రీనివాసుడి`పై దిల్ రాజు ఆశ చావకపోవడం విశేషం. మరి దిల్ రాజు చెప్పినట్లు ఫ్యామిలీ ఆడియన్స్ ఎంత వరకు కలెక్షన్లు తెస్తారో వేచి చూడాలి.