రాజుగారికి మళ్ళి దెబ్బ పడింది

0

చాలా క్యాలికులేటెడ్ గా కథలను బేరీజు చేసి పక్కా ప్లాన్ తో సినిమాలు నిర్మిస్తారని పేరున్న దిల్ రాజు లెక్కలు ఈ ఏడాది పూర్తిగా తప్పాయి. తన పేరునే బ్రాండ్ గా మార్కెటింగ్ చేసుకునే ఆయన నమ్మకాన్ని ఈ ఏడాది బాగా దెబ్బ తీసింది. ఆడవు అని ముందే ఫిక్స్ అయినవాటితో పాటు ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని గట్టిగా చెప్పినవి అన్ని నిరాశ పరిచాయి. అది కూడా కేవలం ఆరు నెలల వ్యవధిలోపే జరగడం ఇంకా షాక్ ఇచ్చే విషయం. గత ఏడాది ఆరు సినిమాలతో కమర్షియల్ సక్సెస్ అందుకుని దాన్ని వేడుకలా చేసుకున్న దిల్ రాజు ఈ సంవత్సరం ఇప్పటి దాకా మూడు ఫ్లాపులు తన ఖాతాలో వేసేసుకున్నారు.దే ఫిక్స్ అయినవాటితో పాటు ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని గట్టిగా చెప్పినవి అన్ని నిరాశ పరిచాయి. అది కూడా కేవలం ఆరు నెలల వ్యవధిలోపే జరగడం ఇంకా షాక్ ఇచ్చే విషయం. గత ఏడాది ఆరు సినిమాలతో కమర్షియల్ సక్సెస్ అందుకుని దాన్ని వేడుకలా చేసుకున్న దిల్ రాజు ఈ సంవత్సరం ఇప్పటి దాకా మూడు ఫ్లాపులు తన ఖాతాలో వేసేసుకున్నారు.

రాజ్ తరుణ్ లవర్ ఆయనకే పెద్దగా నమ్మకం లేనట్టుగా ప్రమోట్ చేయడంతో ఫలితం కూడా అందుకు తగ్గట్టు వచ్చింది. కానీ సంప్రదాయాలు పెళ్లి విలువలు అంటూ ఎంతో ఆశించిన శ్రీనివాస కళ్యాణం సైతం తీవ్రంగా నిరాశపరచడం ఊహించనిది. ఇప్పుడు హలో గురు ప్రేమ కోసమే కూడా అదే దారిలో ఉన్నట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో దీని రన్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. మొదటి వీకెండ్ లో కేవలం $204 వేల డాలర్లు మాత్రమే వసూలు చేసిన ఈ మూవీ రోజు రోజుకి గ్రాఫ్ డౌన్ అవుతూ పోవడం అక్కడి బయ్యర్లను టెన్షన్ పెడుతోంది. కేవలం అర వెయ్యి డాలర్లు మాత్రమే రెండు రోజులకు తోడవ్వడం పరిస్థితిని చెప్పకనే చెబుతోంది.

మరోవైపు వచ్చి రెండు వారాలు దాటుతున్న అరవింద సమేత వీర రాఘవనే బెటర్ అనేలా ఇప్పటికే 2 మిలియన్ మార్కు దాటేసి స్టడీగానే ఉంది. పోటీ లేనప్పటికీ హలో గురు ప్రేమ కోసమే యుఎస్ లో ఇంత తీసికట్టుగా ఆడటం దిల్ రాజుకు ఇబ్బంది కలిగిం చేదే. మరి వచ్చే సంక్రాంతికి ఎఫ్2తో అయినా బోణీ కొడతాననే హాప్ తో ఉన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ లో ఎలాగూ మహేష్ మహర్షి ఉంది కానీ అది దిల్ రాజు సోలో ప్రొడక్షన్ కాదు కాబట్టి అందులో వాటా మాత్రమే వస్తుంది. సో 2018 హ్యాట్రిక్ ప్లాప్స్ తో దిల్ రాజు డల్ గా ముగించక తప్పలేదు.
Please Read Disclaimer