రాజుగారు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారే!

0

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రాజు బ్యానర్ నుండి సినిమా వస్తుందన్నా.. అయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమా రిలీజ్ అవుతుందన్నా ప్రేక్షకుల్లో ఆ సినిమాపై ఎంతో ఆసక్తి వ్యక్తం అయ్యేది. కానీ ఈమధ్య పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. ఆయన జడ్జిమెంట్ పై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబో ‘అరవింద సమేత’ రిలీజ్ అయ్యి ఆయనకు కాస్త రిలీఫ్ ఇచ్చింది.

ఈ సినిమాను రాజుగారు నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన విషయం తెలిసిందే. ఓపెనింగ్ కలెక్షన్స్ విషయంలో ఇప్పటికే ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ గా నిల్చిన ఈ సినిమా రాజుగారికి లాభాలు తీసుకోచ్చేదిగానే ఉంది. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో ‘అరవింద సమేత’ టీమ్ తో కలిసి దిల్ రాజు మీడియాతో ముచ్చటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎదురైంది. ఈనెల 18 న దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమా రిలీజ్ కానుంది. త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో రామ్ హీరో గా ఈ సినిమా తెరకెక్కింది. ‘అరవింద సమేత’ రిలీజ్ అయిన వారంలోపే ‘హలో గురూ ప్రేమ కోసమే’ ను విడుదల చేస్తే కాంపిటీషన్ లో నష్టం జరుగుతుంది కదా అంటే..రాజు ఇంట్రెస్టింగ్ జవాబిచ్చారు. దసరా పండగ సీజన్ కు రెండు హిట్ సినిమాలకు స్కోప్ ఉంటుందని.. హాలిడే సీజన్ కాబట్టి ఇబ్బంది ఉండదని చెప్పారు.

అది నిజమే.. మరోవిధంగా కూడా ‘అరవింద సమేత’ హిట్ కావడం దిల్ రాజు జడ్జిమెంట్ పై మరో సారి ప్రేక్షకులకు నమ్మకం వచ్చింది. ఈ ఊపులో దిల్ రాజు సినిమా ‘హలో గురూ ప్రేమ కోసమే’ రిలీజ్ కావడంతో పాజిటివ్ వైబ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. అదే కనుక ‘అరవింద సమేత’ కంటే ముందే ఈ సినిమా రిలీజ్ అయితే.. జనాలు ‘శ్రీనివాస కళ్యాణం’ ..’లవర్’ లాంటి సినిమాలను గుర్తుచేసుకోవలసి వచ్చేది. అందుకేనేమో దిల్ రాజు ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్ కు హాజరై సక్సెస్ లో ఉన్నామనే ఫీలింగ్ కలించారు.
Please Read Disclaimer