రెండూ ఒకేసారా?.. ఎదో తేడా కొడుతోంది

0టాలీవుడ్ లో మల్టీస్టారర్ కథలు చాలా స్పీడ్ గా పట్టాలెక్కేస్తున్నాయి. ఇప్పటికే నాని – నాగ్ సినిమా షూటింగ్ సగానికి చేరుకోగా ఇప్పుడు వరుణ్ తేజ్ – వెంకటేష్ F2 సినిమా కూడా పట్టాలెక్కడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంది. చాలా రోజులుగా ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న చిత్ర యూనిట్ ఈ రోజు సినిమాను లాంచ్ చేసింది. మరికొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేసి త్వరగా ప్రొడక్షన్ పనులను ఫినిష్ చెయ్యాలని అనుకుంటున్నారు.

ఫైనల్ గా F2 సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు అధికారంగా చిత్ర యూనిట్ ముందే చెప్పేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అంతా బాగానే ఉంది గాని రిలీజ్ విషయంలోనే కొంచెం తేడా కొడుతోందని చెప్పవచ్చు. ఎందుకంటే మహేష్ 25వ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు చెప్పేశారు. ఆ సినిమాను కూడా దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఒకే బ్యానర్ పై రెండు సినిమాలను తెరకెక్కించడం అలాగే వాటిని ఒకే సారి రిలీజ్ చేయడం అంటే చాలా కష్టం. దిల్ రాజు చాలా అలోచించి గాని ఒక సినిమాను విడుదల చేయరు. ఆయనకు అన్ని తెలుసు. మరి ఈ రిలీజ్ డేట్స్ లో ఏదైనా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారా? లేక మహేష్ సినిమాను లెట్ గా రిలీజ్ చేస్తారా? అనే సందేహం నెలకొంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.. ఇక మహేష్ 25వ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.